అధికార పార్టీ వైసీపీ టిడిపి అధినేత చంద్రబాబు మధ్య గత కొద్దిరోజులుగా మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది.. ముఖ్యంగా ఏదైనా సభలలో ప్రసంగా సమయంలో కూడా మాట్లాడుతూ ఉంటారు.. నిన్నటి రోజున కుప్పంలో టిడిపి బహిరంగ సభను సైతం నిర్వహించారు. ఈ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడడం జరిగింది. తన సొంత ఇలాకా అయినా కుప్పంలో తనను ఓడిస్తానని.. వై నాట్ 175 అనే నినాదంతో వైసిపి నేతలు అంటున్నారంటూ ఫైర్ అయ్యారు.. తాను కూడా వై నాట్ పులివెందల అంటున్నానంటూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.


వైసిపి కుప్పంలో చేస్తున్న రాజకీయాలు చాలా నీచమైన రాజకీయాలంటూ కూడా నిప్పులు జరిగారు బాబు.. వచ్చే ఎన్నికలలో కుప్పంలో గెలుపు కాదు కదా కనీసం వైసిపి పార్టీకి డిపాజిట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తనపైన రౌడీయిజం చేయాలని చూస్తున్నారంటూ బాబు ఫైర్ అయ్యారు.. కుప్పంకు రావడానికి సీఎం జగన్ అనర్హుడు అంటూ కూడా చంద్రబాబు కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.. కేవలం సినిమా సిట్టింగులతోనే కుప్పం ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఎద్దేవ చేశారు చంద్రబాబు..


టిడిపి అధికారంలోకి రాగానే కుప్పానికి హంద్రీనీవా నీళ్లు ఇప్పిచ్చే బాధ్యత  తీసుకువస్తామంటూ చంద్రబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్నికలలో జనసేన బీజేపీ పార్టీలతో సైతం పొత్తు పెట్టుకుని మరి ముందుకు వెళ్తున్నామంటూ చంద్రబాబు తెలియజేశారు.. ఏపీ సీఎం జగన్ ను ఓడించడమే తమ లక్ష్యంగా పెట్టుకొని కూటమితో ముందుకు వెళ్లాలని ఎన్నికల బరిలో దిగబోతున్నామని వెల్లడించారు.. ప్రస్తుతం చంద్రబాబు చేసినటువంటి ఈ వాక్యాలకు వైసీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్ వేస్తూనే ఉన్నారు.. ఇప్పటికే అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నియోజకవర్గాల వారీగా తమ అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా టిడిపి జనసేన మధ్యనే అసంతృప్తులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: