ఎన్నికల హడావుడి మొదలవటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం  సరికొత్త మలుపు తీసుకుంటోంది. జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 175 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.టీడీపీ పార్టీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక, ప్రచారం..ఎన్నికల మేనిఫెస్టో పైనే అధినేతలు పూర్తి ఫోకస్ చేస్తున్నారు.ఇదే సమయంలో గుంటూరు కంచుకోటలుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ నూతన ఇంఛార్జ్ లను నియమించారు.ఈ ఎన్నికల్లో జగన్ - చంద్రబాబు ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్నట్లు భావిస్తున్న నియోజకవర్గాల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు.. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అదనంగా పార్టీ నుంచి ముఖ్య నేతలను నియమిస్తున్నారు.. 

అందులో భాగంగా గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యులను ఎన్నికల ఇంఛార్జ్ గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గతంలో ఎన్నికల్లో పోటీ, పని చేసిన అనుభవం గల  సీనియర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ఇంఛార్జ్ బాధ్యతలను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే అక్కడ మురుగుడు లావణ్యతో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ లోకేష్ ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తొలి నుంచి అడుగులు వేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరితో పాటుగా టీడీపీ బలంగా కనిపిస్తున్న వేమూరు నియోజకవర్గ బాధ్యతలను కూడా కేటాయించారు. అదే విధంగా, మర్రి రాజశేఖర్ కు తాడికొండ, ప్రత్తిపాడు మరియు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.  రేపల్లో నియోజకవర్గం కోసం వైసీపీ ఎన్నికల పరిశీలకుడిగా గాదె మధుసూధన రెడ్డిని నియమించారు. వైసీపీ,టీడీపీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడుతున్న సత్తెనపల్లి, చిలకలూరిపేట, పర్చూరు, సంతనూతలపాడు మరియు వేమూరు నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్ గా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ బాధ్యతలు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: