తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అందరికీ కూడా మంత్రి పదవులు వరించాయి అన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా కొనసాగినప్పటికీ మధ్యలో బీజేపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీతోనే నిలబడిన రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం అధిష్టానం ఇప్పటికే మంత్రి పదవిని కట్టబెట్టింది.


 మంత్రి పదవి ఇస్తాము అనే హామీతోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడు అన్న ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తెలిపాడు. కాగా ఇప్పుడు పరిస్థితుల దృశ్య రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయిందా అంటే అవును అనే చెప్పేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా అధిష్టానం హామీ ఇచ్చిందట. అందుకే ఇక రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మీని ఎన్నికల బరి నుంచి తప్పించారు అంటూ ప్రచారం జరుగుతుంది.



 ముందుగా రాజగోపాల్ రెడ్డి  తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించేలా పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చారు.  కానీ ఇక రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మిని ఎన్నికల బరిలో నుంచి విరమింప చేస్తే ఇక మంత్రి పదవిని కట్టబెడతామని అధిష్టానం హామీ ఇవ్వడంతో చివరికి ఆమె ఇలా ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతుందట. మరి ఆయనకు ఏ శాఖను అప్పజెప్పబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ts