ఏపీలో ప్రస్తుతం లోకల్ నుంచి నేషనల్ వరకు ఎన్నో సంస్థలు సర్వేలు జరుపుతున్నాయి. ఇందులో ఏ సర్వే నిజం. ఏది క్షేత్రస్థాయి ఓటర్ల నాడిని పట్టుకుంది అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే సర్వేలు అంతా సర్వేశ్వరులు కాదు. వారికి ఉన్న అంచనాలు చెబుతారు. పైగా పెయిడ్ సర్వేలు కూడా చాలా జరిపిస్తున్నారు అని కొంతమంది అంటున్నారు.


గతంలో సర్వేలు ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఉండేవి. కానీ మారుతున్న కాలంతో పాటు ఆయా పార్టీల నేతలే పాజిటివ్ ప్రచారం కోసం తమ పార్టీనే గెలుస్తుంది అనే తరహాలో పెయిడ్ సర్వేలు చేయించుకొని ప్రజల్లోకి వదులుతున్నారు. ఇలాంటి అంశాలు తటస్థ ఓటర్లపై ప్రభావం చూపుతాయి. ఏపీ విషయానికొస్తే వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే.. మరికొన్ని టీడీపీదే పక్కా విజయం అంటూ స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ అన్నట్లు ఐబీ సర్వే ఫలితాలు అంటూ సోషల్ మీడియా లో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది.


కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే అని నెట్టింట వైరల్ అవుతుంది. ఆ సర్వేలో చూస్తే ఏపీలో వైసీపీకి 49-51శాతం ఓటు షేర్ తో 118-124 సీట్లు, టీడీపీ కూటమికి 41-45 శాతం ఓట్లతో 48-51 సీట్లు, కాంగ్రెస్ కు 1-3శాతం ఓట్లతో 0-1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు  ఈ సర్వేలో ఉంది. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అన్నది ఎవరికీ తెలియదు కానీ సర్క్యులేట్ మాత్రం తెగ అవుతోంది.


ఏది ఎలా ఉన్నా వైసీపీ మాత్రం దీనిపట్ల ఫుల్ ఖుషీగా ఉంది. ప్రస్తుతం ఏపీలో హోరా హోరీ పోరు సాగుతుంది అనేది వాస్తవం. దీని మీద రకరకాల చర్చలు విశ్లేషణలు సాగుతున్నాయి. ఇది వైసీపీ ఎత్తుగడగా టీడీపీ నేతలు విమర్శిస్తుంటే.. ఈ సర్వే నిజం కాబట్టే బీజేపీ నేతలు ఏపీ పై దృష్టి సారించడం లేదని వైసీపీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. మరి ఇది నిజమా కాదా అంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: