వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల  ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్ధం సభలకు, రోడ్ షోలకు జనం భారీ ఎత్తున వస్తున్నారు. దాదాపు ఏపీ అంతటా మొదటి విడత ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉంది. ప్రస్తుతం జగన్ ఏపీ నడిబొడ్డు విజయవాడలో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వచ్చిన ఆయన అభిమానులు పూల వర్షం కురిపించారు.


ఈ క్రమంలో శనివారం బస్సు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.  అయితే ఈ సమయంలో ఓ ఆగంతకుడు జగన్ పై రాయి విసిరిన ఘటన చోటు చేసుకుంది. దీంతో  ఆయన కంటికి గాయమైంది. అవును సీఎం జగన్ పై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ అగంతకుడు. విజయవాడలోని సింగ్ నగర్ కు చేరుకున్న సమయంలో సీఎంపై రాయితో దాడి చేశారు.


బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. రాయి అత్యంత వేగంగా వచ్చి సీఎం కనుబొమ్మను తాకింది. దీంతో ఆయనకు స్వల్ప గాయమైంది. క్యాట్ బాల్ లో రాయిపెట్టి విసరడంతో వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తాకినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన వైద్యులు బస్సులోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స  అనంతరం జగన్ తిరిగి బస్సు యాత్రను కొనసాగించారు.


ఇదే సమయంలో సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైనట్లు తెలుస్తోంది. ఇక విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రలో జనం పోటెత్తారు. దీంతో విజయవాడలో సుమారు మూడున్నర గంటలకు పైగా బస్సు యాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షోగా కొనసాగుతోంది. దీంతో జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో కరెంట్ నిలిచిపోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా నిందితుల జాడ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: