ఈరోజు టీడీపీ పార్టీలో జగన్ రాయి దాడిలో నిందితుడైన వేముల దుర్గారావు ఒక హీరో అయిపోయారు. అందుకే ఈనాడు టీవీ 5 ఆంధ్రజ్యోతి మహా న్యూస్ అంటే టీడీపీ మౌత్‌పీసులు ఆయనను తెగ ఇంటర్వ్యూ చేసేసాయి. టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు తీసుకోవడమే కాదు పేపర్లలో ఫ్రెంట్ పేజీలో దుర్గారావుని నాలుగు రోజుల విచారణ తర్వాత వదిలేసారు అంటూ వార్తలను ప్రచురించాయి. అతన్ని వైసీపీ అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసిందంటూ, కానీ అతను కడిగిన ఆణిముత్యం లాగా, ఒక హీరో లాగా బయటికి వచ్చారని ఈ వార్తా పత్రికలు న్యూస్ రాశాయి.

ఇంటర్వ్యూలలో పాల్గొన్న దుర్గారావు తనను పోలీసులు బాగా ఇబ్బంది పెట్టేశారని, టీడీపీ వాళ్లే ఈ దాడి చేయించారని ఒప్పుకోవాలంటూ తనను హింసించారని అతను చెప్పుకొచ్చాడు. తన చేత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని, దానికి భవిష్యత్తులో ఏ ప్రమాదం జరిగినా పోలీసులదే బాధ్యత అని అతడు మీడియా ముందు కామెంట్లు చేశాడు. అయితే దాని చేసినట్లు మీ దగ్గర రుజువు ఏమైనా ఉందా, పని చేయని తప్పును ఎప్పటికీ ఒప్పుకోనని దుర్గారావు ఖరాఖండిగా చెప్పేశాడట.

 ఆ మాటలు వినగానే పోలీసులు బాగా కోపం తెచ్చుకొని నువ్వు చేసినట్లు మా దగ్గర ప్రూఫ్ ఉంది అని, అతడిని ఒప్పుకోమని బాగా బలవంత పెట్టారట. అయినా దుర్గారావు వారి హింసాత్మక విచారణకు లొంగిపోలేదట. తాను ఏ తప్పు చేయలేదని మాటను చివరి వరకు చెప్పు కొచ్చాడట. ఘటన జరిగినప్పుడు తాను అసలు స్కూల్ దగ్గరే లేనని, ఆ టైమ్ కు టీడీపీ కార్యాలయంలో ఉన్నానని అతడు వివరించాడట. తర్వాత పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ అర్ధరాత్రి విచారణ చేస్తూ కొడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఒప్పించడానికి పోలీసులు ట్రై చేశారట. చివరికి ఒక పోలీస్ అధికారి "నీ తప్పు ఏమీ లేదు, నిన్ను వదిలేస్తున్నామ"ని చెప్పి తెల్ల కాగితాలపై సంతకం పెట్టించుకుని తెల్లవారుజామున ఇంటి దగ్గర దిగబెట్టారట.

 అయితే దుర్గారావు ఏమీ తప్పకుండా టీడీపీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు ని కాపాడారని అందుకే ఆయన ఇప్పుడు టీడీపీలో హీరో అయ్యాడని రాజకీయ విశ్లేషకులు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: