•భీమిలిలో తన మార్క్ చూపిస్తున్న గంట శ్రీనివాస రావు
•గంట ముందు తేలిపోతున్న అవంతి శ్రీనివాస్ 
•ఎన్ని కుట్రలు చేసినా వైసీపీని గెలిపించలేకపోతున్న అవంతి


విశాఖ, ఇండియా హెరాల్డ్ : భీమిలిలో గంటా శ్రీనివాస రావు, అవంతి శ్రీనివాస్ ఇద్దరు కూడా మంచి పట్టున్న నేతలు. వీరిద్దరూ అంతకముందు గురు శిష్యులు. కానీ ఇప్పుడు వీరి ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ప్రస్తుతం గంట శ్రీనివాస్ తన మార్క్ చూపిస్తున్నాడు. గంట శ్రీనివాస రావు ఒక్క సారి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే.. అక్కడ రాజకీయాన్ని తనదైన శైలిలో చాలా ఈజీగా మార్చేసుకుంటారు. ఇప్పుడు అయితే భీమిలీలో ఆయన అవంతి శ్రీనివాస్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు గంట శ్రీనివాస రావు . గతంలో ఓ సారి గెలిచిన నియోజకవర్గమే కాదు ఇప్పటికీ బలమైన అనుచర వర్గం ఉన్న నియోజకవర్గంగా భీమిలికి పేరుంది. స్థానిక ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా కూడా వైసీపీని పూర్తి స్థాయిలో గెలిపించలేకపోయిన అవంతి శ్రీనివాస్.. గంటా శ్రీనివాస రావు ముందు తేలిపోతున్నారు. వైసీపీ క్యాడర్ ను గంటా శ్రీనివాస రావు రోజుకు రెండు షిప్టుల్లో పార్టీలో చేర్చుకుంటున్నారు. వీరిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉంటున్నారు. పంచాయతీల్లో సర్పంచ్‌లు వార్డు మెంబర్లు సహా అందరూ కూడా చేరిపోతున్నారు.


అవంతి శ్రీనివాస్ ఏమాత్రం కూడా వారిని ఆపలేకపోతున్నారు. గంటా శ్రీనివాస రావు ఇంటి దగ్గర క్యాంప్ పెట్టుకుని అక్కడకు వస్తున్న వారిని గుర్తించి.. ప్లీజ్. ప్లీజ్ టీడీపీలోకి పోవద్దని ఆయన బతిమాలుతున్నారు. కానీ ఒక్కరికీ కూడా మనసు కరగడం లేదు. అందరూ పోలోమంటూ తెలుగు దేశం పార్టీలోకి చేరిపోతున్నారు. అవంతి శ్రీనివాస్ పై సహజంగానే నియోజకవర్గంలో చాలా తీవ్రమైన వ్యతిరేకత అనేది ఉంది. ఆయనకు టిక్కెట్ ని నిరాకరిస్తారని కూడా అనుకున్నారు. కానీ గట్టి అభ్యర్థి దొరకలేదేమో కానీ చివరికి ఆయననే కొనసాగించారు. అందుకే భీమిలి కంటే మంచి నియోజకవర్గం ఉండదనుకున్న గంటా శ్రీనివాస రావు పట్టుబట్టి దాన్నే కేటాయింప చేసుకున్నారు. ఇప్పుడు తనదైన మార్క్ రాజకీయాలతో అక్కడ దడ పుట్టిస్తున్నారు. మొత్తానికి గురు శిష్యుల పోరులో గంట శ్రీనివాస రావు తన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: