ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి సరిగ్గా 70 గంటల సమయం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో ఏ పార్టీ ఓటర్లకు ఎంత మొత్తం డబ్బు పంపిణీ చేస్తుందనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడం వల్లే ఓడిపోయారని టాక్ ఉంది.
 
అయితే ఈ ఎన్నికల్లో పవన్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. పిఠాపురం ఓటర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ జనసేన ఓటుకు 5000 రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. లక్ష మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత ఓటుకు 3000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
జనసేన తమ పార్టీ కంటే ఎక్కువ మొత్తం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయానికి వైసీపీ మరో వెయ్యి లేదా 2,000 రూపాయలు మళ్లీ పంపిణీ చేసే ఛాన్స్ ఉంది. ఒక విధంగా పిఠాపురం ఓటర్లు అదృష్టవంతులు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే పిఠాపురంలోని అన్ని గ్రామాలలో ఇంతే మొత్తం కచ్చితంగా పంపిణీ చేస్తారని చెప్పలేము.
 
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కోరుకున్న ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. పిఠాపురం నియోజకవర్గాన్ని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగన్ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కచ్చితంగా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం అందుతోంది. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కావడం ఆయనకు ఒకింత మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: