ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు నెలల నుండి ఎలక్షన్ల కారణంతో వాడి వేడి వాతావరణం నెలకొంది. మే 13 వ తేదీన రాష్ట్రమంతటా ఎలక్షన్లు పూర్తి అయ్యాయి. దానితో ఎలక్షన్లలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత జరిగింది? దానిలో మహిళలు ఎంత? పురుషులు ఎంత? వృద్ధులు ఎంత? యువకులు ఎంత? వాటిలో ఎవరికి ఎంత శాతం ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.

ఇలా అనేక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఎవరి వైపు ఆంధ్ర ప్రజలు మొగ్గు చూపారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మహిళలకు , వృద్ధులకు , రైతులకు అనేక పథకాలను అందించారు.

ఇక వీరితో పాటు మరి కొంత మంది కి కూడా కొన్ని పథకాలను అందించారు. ఇలా వైసీపీ ప్రభుత్వం అందించిన పథకాలను అందుకుంటున్న వారు దాదాపుగా ఈ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది. ఇక యువత ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ సైడ్ నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో కూటమి సైడ్ పవన్ వల్ల ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది.

అలాగే పవన్ కాపు సామాజిక వర్గ వ్యక్తి కావడంతో కాపు సామాజిక వర్గ ఓట్లు కూటమి సైడు వచ్చే అవకాశం ఉంది. మైనార్టీ సామాజిక వర్గ ఓట్లు వైసీపీ కి పడే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూటమి సైడ్ పడే అవకాశం ఉంది. బ్రాహ్మణ ఓట్లు బీజేపీ పార్టీ వల్ల కూటమి కి పడే అవకాశం ఉంది.

ఇక మొత్తం పరిస్థితులను బట్టి చూస్తే కొంత శాతం వైసీపీ పార్టీ సైడ్ ఎడ్జ్ కనిపెడుతూ ఉంటే , మరొక కొంత కూటమికి ఎడ్జ్ కనబడుతుంది. మరి ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీని తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ చేస్తుంది అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap