- బుగ్గన హట్రిక్ కొడతాడా.?  
-  ప్రజలు కోట్లకు తూట్లు పొడిచారా.?
- వైసిపి పథకాలే  గెలిపించబోతున్నాయా.?

 ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలలో   డోన్ నియోజకవర్గం చాలా కీలకమైంది . ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు సీనియర్ లీడర్ల మధ్య జరిగినటువంటి ఈ పోరులో ఎవరికి విజయ అవకాశాలు వరించబోతున్నాయి. ప్రజలు ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 బుగ్గన వర్సెస్ కోట్ల :
 ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు గెలిచిన నాయకులు  రాష్ట్ర, దేశస్థాయిలో  ఎదిగారు. ఈ నియోజకవర్గంలో నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈసారి వైసీపీ నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన మరోసారి బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి కోట్ల  విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు సూర్య ప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. కోట్ల ఫ్యామిలీ ఇక్కడ నుంచి ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించింది. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వరుసగా రెండుసార్లు విజయాన్ని అందుకున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు, టిడిపి నాలుగు సార్లు, ఇండిపెండెంట్లు, వైసీపీ అభ్యర్థులు చెరో రెండు సార్లు గెలుపొందారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఒకసారి గెలిచారు. 2014, 2019లో వైసీపీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల25వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,10,855,  మహిళా ఓటర్లు 1,14,000 మంది ఉన్నారు. పోయిన ఎన్నికల్లో బుగ్గన 35,516 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో వైశ్య, కాపు, ముస్లిం మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే యాదవ, కురుబా,  వాల్మీకి, సామాజిక వర్గాలు కూడా అధికంగానే ఉన్నారు.

 గెలుపోటములు:
 ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కొనసాగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అక్కడి ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాడు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, మార్కెట్ యార్డులు కట్టించడం, ఇలా డోన్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిలో పరుగులు పెట్టించారని చెప్పవచ్చు. అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి  అందినటువంటి పథకాలు కూడా బుగ్గనకు కలిసి వచ్చే అంశం. ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.  ఇవి కూడా వైసిపి కి ప్లస్ గా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా బుగ్గన ఇప్పటికే రెండుసార్లు గెలిచి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.  ఇదే తరుణంలో ఆయన ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. డోన్ ప్రజలు కూడా  బుగ్గన వైపే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి కోట్ల విషయానికి వస్తే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కానీ బుగ్గనకు ఉన్నంత పేరు లేదు. అంతేకాకుండా  ముస్లిం ఓట్ల ప్రభావం ఈయనపై చూపిస్తుంది. బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకుంది కాబట్టి ముస్లిం ఓట్లన్ని వైసిపి వైపే పడ్డాయి. అయితే కొన్ని నెలల క్రితమే  ధర్మవరం సుబ్బారెడ్డిని టిడిపి అధిష్టానం  ప్రకటించింది. ఇంతలో ఏమైందో ఏమో ఈ సీటు అనూహ్యంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని వరించింది. దీనివల్ల  సుబ్బారెడ్డి దిక్కార స్వరం వినిపించారు. ఆ తర్వాత వారు కలిసిపోయినా కానీ లోలోపల మాత్రం మదన పడుతూనే ఉన్నారు. ఇది కూడా బుగ్గనకు కలిసి వచ్చే అంశం.  ఈ విధంగా ఎలాంటి అంశాలు చూసుకున్నా ఈసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: