2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఫలితాలు ఒకింత భయంకరమైన ఫలితాలు అనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఈ ఫలితాలు ఒక విధంగా చెప్పకనే చెప్పేశాయి. 2019లో జగన్ తన సామర్థ్యంతో 151 స్థానాల్లో పార్టీని గెలిపించుకోగా 2024 ఎన్నికల సమయానికి మాత్రం ఆ ఫలితం రివర్స్ అయింది. జగన్ కు సవాళ్లు కొత్త కాదు. ఇతర పార్టీల నేతల నుంచి ఇబ్బందులు సైతం కొత్త కాదు.
 
జగన్ పోరాట స్పూర్తిని సైతం అభిమానించే వాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో జగన్ తన పాలనలో జరిగిన తప్పులను సైతం సరిదిద్దుకోవాల్సి ఉంది. జగన్ తన పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పే విషయంలో ఫెయిల్ అయ్యారని టాక్ ఉంది. పోలవరంకు జగన్ వెళ్లిన సమయంలో మీడియాతో ముచ్చటించడం కానీ పోలవరానికి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం కానీ చేయలేదు.
 
ప్రజలకు వాస్తవాలు ఏంటో సరిగ్గా వెల్లడించగల సామర్థ్యం ఉన్న జగన్ మీడియాను ఫేస్ చేయకుండా ఉండటం ఆయనకు మైనస్ అయిందని తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో జగన్ స్పందించినా సత్వర న్యాయం జరిగేలా చేయడంలో ఫెయిలయ్యారు. జగన్ చేసిన తప్పులు ఇవేనని చంద్రబాబు మాత్రం మీడియాతో ముచ్చటిస్తూ తన మార్క్ చాటుకుంటున్నారు.
 
ఎన్నికల్లో ఓటమికి పదుల సంఖ్యలో కారణాలు ఉంటాయి. ఆ కారణాలను గుర్తు పెట్టుకుని ప్రజల మెప్పు పొందుతూ ముందడుగులు వేస్తే మాత్రమే భవిష్యత్తులోనైనా వైసీపీ అధికారాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాలంతో పాటు మారని పక్షంలో వైసీపీకి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. జగన్ ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మారాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ మారితే వైసీపీలో కొత్త జోష్ వస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: