పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నమ్ముకుని ఎంతో కష్టపడిన కీలక నేతలలో అనుశ్రీ సత్యనారాయణ ఒకరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, నాగబాబుకు అనుశ్రీ సత్యనారాయణ సన్నిహితుడు కాగా పొత్తుల వల్ల ఈ నేతకు టికెట్ దక్కలేదు. రాజమండ్రి సిటీ జనసేన ఇన్ ఛార్జ్ అయిన సత్యనారాయణ టీడీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడి ఆదిరెడ్డి వాసును గెలిపించారు. దాదాపుగా 70 వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి వాసు గెలిచారు.
 
2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో జనసేన తరపున పోటీ చేసిన అనుశ్రీ సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. అనుశ్రీ సత్యనారాయణకు ఏదో ఒక పదవి వస్తుందని ప్రచారం జరుగుతుండగా పార్టీ నమ్ముకుని పార్టీ కోసం కష్టపడిన ఈ నేతకు పవన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.
 
జనసేన తరపున ఎవరికి పదవి దక్కినా దక్కకపోయినా అనుశ్రీ సత్యనారాయణకు మాత్రం పదవి దక్కితే పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందని ప్రూవ్ చేసినట్టు అవుతుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో ఏపీలో పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ రావడం జనసేనకు కలిసొచ్చింది.
 
భవిష్యత్తులో కూటమి తరపున అనుశ్రీ సత్యనారాయణ పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సత్యనారాయణకు ప్రాధాన్యత ఉన్న పదవి దక్కితే మంచిదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు సైతం న్యాయం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందని చెప్పవచ్చు. పదవులకు సంబంధించి అనుశ్రీ సత్యనారాయణ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. జనసేన పార్టీ రాష్ట్రంలో మరింత బలపడే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు పడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: