- ప్రజలను రెచ్చగొట్టిన కేసీఆర్..
- చివరికి చేసింది ఏమీ లేదు..
హైదరాబాద్ నడిగడ్డపై అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ఎంతో ఫేమస్. ఈ స్టూడియోల ద్వారా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఎంతోమంది నటీనటులు వారి జీవితాన్ని సినిమా రంగం వైపు మళ్ళించుకుని ఈ స్టూడియోల ద్వారానే ఉపాధి పొందుతున్నారు. అలా డైరెక్ట్ గా ఇన్డైరెక్టుగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అన్నపూర్ణ స్టూడియోను రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కూల్చేస్తానని ఎన్నో మాటలు అన్నారు. కానీ చివరికి అభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి ఆ స్టూడియోను కనీసం టచ్ చేయలేకపోయారు. ఈ విధంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో సినిమా వాళ్లకి చుక్కలు చూపించారని చెప్పవచ్చు. కనీసం టికెట్ల రేట్లు పెంచుకునే సహకారం కూడా అందించకుండా, ఆయనకు అవసరమైనప్పుడల్లా తొక్కేయడానికే ప్రయత్నం చేశారు. అలాంటి కేసీఆర్ అన్నపూర్ణ స్టూడియోని కూల్చేశారా.. ఆయన ఆ గోడను ఎందుకు కూల్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించినటువంటి ఆరా ఎకరం భూమిని రోడ్డు వెడల్పు పనుల కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్ లో అన్నపూర్ణ స్టూడియో ఉన్నది అందరికీ తెలుసు. ఈ స్టూడియో అక్కినేని ఫ్యామిలీకి చెందినది. అయితే అన్నపూర్ణ స్టూడియో ఏరియాలో తెలంగాణ ప్రభుత్వం రోడ్డు వెడల్పు పనులను మొదలుపెట్టింది. దీనికోసం స్టూడియో నుంచి ఒక అర ఎకరం భూమి తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని అప్పుడు ప్రయత్నాలు చేసి చివరికి సాధించింది. ముందుగా ఈ భూమి ఇవ్వడానికి అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఒప్పుకోలేదు. కానీ చివరికి ఎలాగోలా ఒప్పించింది. అయితే ఆ భూమికి పరిహారం అందించే విషయంలో మాత్రం సర్కారు చాలా డైలామాలో ఉంది. అయితే పరిహారానికి బదులు డబ్బులు ఇవ్వడానికి ఏవైనా అభివృద్ధి పనులు చేసుకునేందుకు హక్కు ఇచ్చేందుకు అప్పట్లో పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి