ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్లను చంద్రబాబు నాయుడు పంపిణీ చేస్తున్న విధానం లో లోపం ఉందని... పెన్షన్లను చాలా వరకు తగ్గించారని వైసీపీ చెబుతోంది. మొన్నటి మే మాసంలో... ఆంధ్రప్రదేశ్ పెన్షన్ దారులు 65, 49, 874 మంది ఉన్నారని వైసీపీ చెబుతోంది. ఆ సందర్భంగా మొత్తం పెన్షన్ దారులు..తమ పెన్షన్ తీసుకున్నారని తెలిపింది.
ఇక జూలై మాసం లెక్కలు కూడా వైసిపి బయట పెట్టింది. జూలై మాసం లో కొంత మందికి తగ్గించి పెన్షన్ పంపిణీ చేశారని టిడిపి ఫైర్ అవుతోంది. జులై మాసం వచ్చేసరికి.. 65,18,418 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారని టిడిపి ఫై వైసిపి ఆరోపణలు చేసింది. ఇక ఈ దఫా ...64,81052 లక్షల మంది పెన్షన్ దారులకు తెలుగుదేశం కూటమి పెన్షన్ ఇచ్చిందని వైసిపి ఆరోపణలు చేస్తోంది.
అయితే క్రమక్రమంగా... ఒక్కోనెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందని వైసిపి స్పష్టం చేస్తోంది. ఈ లెక్కన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత... దాదాపు 67,000 మందికి పైగా పెన్షన్లు కట్ అవుతున్నాయని పేర్కొంది వైసిపి పార్టీ. ఈ మేరకు లెక్కల తో పాటు బయటపెట్టింది. తమ ప్రభుత్వం లో అందరికీ.. పెన్షన్లు ఇచ్చామని... కానీ చంద్రబాబు ఎప్పుడు కోతల రాయుడైనని.. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసిపి. అయితే దీని పై ప్రభుత్వం అధికారిక లెక్కలు బయట పెడితే అసలు వాస్తవం బయటకు వస్తుంది. అప్పటి వరకు పెన్షన్ల పై ఇలా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.