అయితే ఎన్నికలు అయిపోయి ఇప్పుడు ఆరు నెలలు కావస్తూ ఉన్న వరుస పెట్టి జగన్ మోహన్ రెడ్డి నియోజవర్గాల వారిగా కొత్త ఇన్చార్జిలను సైతం ఎంపిక చేయడం జరుగుతోంది. ఈ విధంగా చూస్తే శింగనమలలో కూడా కొత్త ఇన్చార్జి వైసీపీ నుంచి రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమిని దీటుగా ఎదుర్కోవాలి అంటే ఒక బలమైన అభ్యర్థి కోసం జగన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు మంచి వ్యక్తి అయిన ఆర్థికంగా స్తోమత లేని వారు కావడం చేత ఆయన ప్లేసులో ఒక బడా లీడర్ని తీసుకువచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే నియోజవర్గంలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే మాజీ మంత్రి శైలజనాధుని వైసీపీ పార్టీ ఆహ్వానించి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే నియోజకవర్గం లోనే కాదు ఏపీలోనే కొంతమేరకు షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నుంచి మంచి పేరున్న నేతగా ఉన్న శైలజానాథ్ వైసీపీ పార్టీలోకి చేరుతారు అంటే అది ఆ పార్టీకి కూడా ప్రెస్ అవుతుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజం ఐతే వచ్చే జనవరిలో శైలజనాద్ వైసీపీ పార్టీలోకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టిడిపి పార్టీ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి