
అదే సమయంలో వడతీవ్రత విపరీతంగా పెరుగుతుంది. 9 దాటిందంటే చాలు బయట అడుగుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాలు పిట్టల రాలిపోతున్నారు. ఈ తరుణంలోనే గడిచిన మూడు రోజుల్లో మొత్తం 30 మంది జనాలు మరణించారు. ఇందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎండాకాలంలో 9 తర్వాత బయటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.
అత్యవసరమైతే తప్ప... బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితిలో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వస్తున్నాయి. ఏపీలోని ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాలలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి.
మరో 28 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. పలుచోట్ల ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే కచ్చితంగా రాళ్ల వాన పడుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇలాంటి నేపథ్యంలో వరి కోత పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుంచి బయటపడేందుకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటికి వెళ్లేవారు కచ్చితంగా మంచినీళ్లు తాగి వెళ్లాలని సూచిస్తున్నారు. లేదా ప్రతిరోజు మజ్జిగ తాగాలని.. చెబుతున్నారు. బయటకు వెళ్తే టోపీ లేదా కచ్చితంగా కర్చీఫ్ అయినా కట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.