ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ పై ఉగ్ర దాడులు చేస్తే అస్సలు సహించనని చెప్పకనే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కాగా మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ లో ఉన్న తుమ్లూర్ గ్రామానికి చెందిన ఆర్మీ సైనికుడు సచిన్ యాదవ్ రావు వనాంజే జమ్మూ కశ్మీర్ లో మృతి చెందారు. పాక్ కాల్పుల్లో దేశానికి చెందిన మరో వీర జవాన్ అమరుడు కావడం దేశానికి మరింత బాధను మిగిల్చింది.
 
29 సంవత్సరాల వయస్సు ఉన్న సచిన్ మరణ వార్త తెలిసి అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి చెందడాన్ని మరవక ముందే దాయాది దేశానికి చెందిన సైనికుల బుల్లెట్ కు మన సైనికుడు బలయ్యారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన ఈ సైనికుల త్యాగాలను దేశం కలకాలం గుర్తుంచుకుంటుందనే చెప్పాలి.
 
కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు సచిన్ మరణానికి సంతాపం తెలియజేయడంతో పాటు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. సచిన్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయని భోగట్టా. సచిన్ పార్థివ దేహాన్ని తరలించడానికి ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
 
భవిష్యత్తులో ఉగ్రవాద ఘటనలకు ఏ దేశం పాల్పడినా యుద్ధం దిశగా అడుగులు పడతాయని భారత ఆర్మీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయే దిశగా ట్రంప్ అడుగులు వేశారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ చేస్తున్న తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: