
దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 19 కమిటీలు వేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు కూడా కీలక పదవి ఇవ్వబోతున్నారట చంద్రబాబు నాయుడు. టిడిపి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఆ బాధ్యతలను నారా లోకేష్ కు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే కడప జిల్లాలో టిడిపి మహానాడు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
కడప జిల్లాలో టిడిపి మహానాడు ఈనెల 27వ తేదీ నుంచి 29 తేదీ వరకు కొనసాగుతుంది. అయితే సరిగ్గా ఈ నెల 30వ తేదీన లేదా జూన్ మొదటి వారంలో కడప జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి మహానాడుకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ సభను నిర్వహించే బాధ్యతలను మొత్తం... పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు... కసరత్తులు మొదలుపెట్టారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు