- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎప్పుడూ లేని సీన్లు చూస్తుంటే రాజకీయ పరిణామాలు శ‌ర‌వేగం గా మారిపోతున్నాయి. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తారని అనుమానాలకు బలం చేకూరుతుంది. పార్టీలో ఉన్న అసంతృప్తిని తండ్రి కేసిఆర్ కు చెబుతూ రాసిన లేక లీక్ అయిన కొద్ది గంటల్లోనే ఎయిర్ పోర్ట్ దగ్గర కవిత టీం హంగామా చేయడం చూస్తుంటే పక్క ప్లాన్ తోనే కవిత ముందుకు వెళుతున్నట్టు స్పష్టమవుతుంది. అయితే కవిత లిఖ్క‌ర్ స్కాం లో బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్తగా అడుగులు వేస్తున్నారు. జిల్లాల పర్యటనలోనూ బిఆర్ఎస్ జెండాలు కనిపించడం లేదు. ఆమె బిఆర్ఎస్ క్యాడ‌ర్‌ తో అంటి ముట్టనట్టుగానే ముందుకు వెళుతున్నారు.


ఇటీవల బిఆర్ఎస్‌ లో కొందరు తనను కావాలనే బ‌దనాం చేస్తున్నారని పనిగట్టుకుని సోష‌ల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ తో పాటు హ‌రీష్ రావు ఒక్క‌టై త‌న‌పై కేసీఆర్ కు లేనిపోనివి చెప్ప‌డంతో పాటు త‌న తండ్రి మ‌న‌స్సే మారేలా చేశార‌ని . . క‌విత‌కు అక్క‌డే అహం బాగా దెబ్బ తింద‌న్న ప్ర‌చారం కూడా బీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది. అందుకే క‌విత త‌న‌ను వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్ట‌డాన్ని త‌ట్టుకోలేక ఇలా త‌న దారి తాను చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇలా లేఖకు ముందు జరిగిన పరిణామాలు లేక తర్వాత జరుగుతున్న సరికొత్త రంగులు చూస్తుంటే కవిత కొత్త దుకాణం పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: