
ఆంధ్రప్రదేశ్ జిఎస్టి వసూళ్లల్లో క్షీణత తగ్గిపోయి కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతున్నది. ఈ విషయాలని కూటమి ప్రభుత్వ చాలా జాగ్రత్తగా గమనించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది అయ్యింది. ఇంత తక్కువ సమయంలోనే ఈ ప్రభుత్వం పైన ప్రజాగ్రహం ఎందుకు ఉందనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతోంది. జీఎస్టీ వసూళ్ల పైన రెండు శాతానికి పైన క్షీణత అందుకు సమాధానం అన్నట్లుగా కొంతమంది పాలకులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు ఈ విషయం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే అందుకే జనం చేతులలో ఎక్కువగా డబ్బులు తిరుగుతూ ఉండేవి. అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా సమృద్ధిగా జరిగాయి .దీంతో ఏపీలో జీఎస్టీ కూడా ఎక్కువగానే వచ్చేదట. అయితే ఎప్పుడైతే చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిందో అప్పటినుంచి పథకాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎన్నికల సమయంలో గెలవడానికి కూటమినేతలు చెప్పిన పథకాలు చూసి ప్రజలు ఆశపడ్డారు. కానీ గెలిచిన తర్వాత చెప్పిన వాటికి చేస్తున్న వాటికి అసలు పోలికే లేకుండా ఉన్నది.
ప్రస్తుతం చంద్రబాబు పాలన, గత వైసిపి పాలన తో జనం పోల్చుతూ ఉన్నారు. కారణాలు ఏవైనాప్పటికీ కూడా ప్రజల చేతులలో డబ్బులు కొరత అనేది ఏర్పడింది. గతంలో అమ్మఒడి, రైతు భరోసా, మహిళలకు భరోసా, వాహన మిత్ర వంటి పథకాల ద్వారా డబ్బులు పడుతూ ఉండేవి. కానీ చంద్రబాబు పాలనలో కేవలం మాటలతో మభ్యపెడుతూ ఉండడంతో ప్రజలను అసంతృప్తి కనిపిస్తోందట. ఈ విషయాన్ని పాలకులు గ్రహించడం లేదని విధంగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పులు పాపాలు అంటూ మీడియా ముందు వచ్చి దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. కానీ తమకు అధికారం ఇచ్చింది గత పాలన కంటే ఇప్పుడు మెరుగైన పాలన అందిస్తారని ఆశతోనే ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కేవలం కాలయాపనతోనే కూటమి ప్రభుత్వం సమయాన్ని గడిపేస్తోంది. ఇటీవలే ఈ విషయాలను చాలామంది టిడిపి నేతలు కూడా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు.
వైసీపీ సంక్షేమాలు హైలెట్ అయినవి..
1).డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపు
2). రైతు భరోసా 13,500.. అలాగే పంటల బీమా వల్ల కూడా లబ్ధి పొందారు.
3). వైయస్సార్ వాహన మిత్ర
4). వైయస్సార్ చేయూత కింద ప్రతి ఏడాది 18,750 రూపాయలు.
5). ఉచితంగా ఇల్ల పట్టాలు ఇల్లులు
6). అమ్మ ఒడి- 15,000
7). వైయస్సార్ కాపు నేస్తం -15,000
8). వైయస్సార్ ఈ బీసీ నేస్తం -15,000
9). చేనేత కార్మికులకు ప్రతిఏటా 24 వేల రూపాయలు.
ఇలా ఇవే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు హైలెట్గా నిలిచాయి.
కూటమి ప్రభుత్వం:
1).ఉచిత మూడు సిలిండర్లను.. అమలు చేసిన నాలుగు నెలలకి ఒకసారి ఇస్తున్నారు.
2).పింఛన్ పెంపు ఒకేసారి చేయడం జరిగింది.
3). ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
4). ఉచిత ఇసుక అమలు చేసినా కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి.
5). చౌక ధరకే మద్యం అమలు చేసిన.. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండడంతో ప్రజలు తిట్టిపోస్తున్నారు.
6). పశువుల దాన, పశువుల షెడ్డు నిర్వహణ
7). పంట నష్టం కింద ఇన్సూరెన్స్ కి గతంలో ఉచితంగా ఉన్నప్పటికీ ఇప్పుడు డబ్బులు చెల్లించడంతో ఎవరూ పట్టించుకోలేదు.
8). రైతులకు డ్రిప్పు పరికరాలు.
మరి రాబోయే రోజుల్లోనైనా మరిన్ని పథకాలను అమలు చేసి మైలేజ్ కూడా పెంచుకుంటుందో లేదో చూడాలి.