రాజకీయ హత్యలు అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక గ్రామంలో ఏకంగా 18 హత్యలు జరిగాయట. పైగా నిందితులకు శిక్ష పడింది కూడా కేవలం ఒక్క కేసులో అంటే ఇది అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ఫ్యాక్షనిజం కనిపిస్తూ ఉంటుంది. అలా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఈ ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్నది. ఇటీవలే జరిగిన ఒక జంట హత్యల కేసు మరొక్కసారి అందుకు నిరూపితమైందని చెప్పవచ్చు. అలా వీటితో కలిపి ఇప్పటికే 15 హత్యలు పోలీసుల రికార్డులలో ఉన్నాయట. వీడికి తోడు మరొక మూడు ఘటనలలో అసలు మృతుల దేహాలు కూడా లభించలేదని అక్కడి గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.


కేవలం 2014లో జరిగిన హత్య కేసులో మాత్రమే నిందితులకు శిక్ష పడిందని ఆ తర్వాత ఐదేళ్లకు బయటికి వచ్చారని మిగతా కేసులలో ఆధారాలు లేకపోవడంతో సాక్షుల్ని నిందితులని బెదిరించడం వంటి కారణాల చేత హాంతకులు తప్పించుకున్నారని అక్కడి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎక్కువగా టిడిపి వారే నష్టపోయారు.


మొదటిసారి 1987లో జడ్పిటిసి ఉప ఎన్నిక తర్వాత ఒక సంఘటనతో గొడవలు ప్రారంభమయ్యాయని అక్కడ పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ 1989లో ఒక గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో బాంబులు, బల్లలు, కత్తులతో దాడులు చేసుకున్నారట. అప్పట్లో టిడిపి పార్టీకి చెందిన పేద కోటయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న మల్లయ్య మరణించారు.. ఆ తర్వాత మళ్లీ 1995 ఫిబ్రవరి 9న కాంగ్రెస్ పార్టీకి చెందిన శివరామయ్య మరో నలుగురు కలిసి.. టిడిపి నేత గుదిబండ బంగారామయ్యను చంపి మృతదేహం కనిపించకుండా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సంవత్సరం టిడిపి వాళ్లు కాంగ్రెస్ నేత రాములను హత్య చేశారు.



ఆ తర్వాత 1996, 97,98 ఇలా వరుసగా ఏడాదికి ఒక హత్య జరుగుతూనే ఉన్నదట.. కొన్నేళ్లు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం మళ్ళీ 2001లో ఒక హత్యా సంఘటన చోటుచేసుకుంది. 2009లో టిడిపి, కాంగ్రెస్ మధ్య  తీవ్రమైన వర్గ పోరు మొదలయ్యింది. 2014లో టిడిపి పార్టీకి చెందిన తోట వెంకట నరసయ్యను వైసిపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు పొలంలో కత్తులతో నరికి చంపారు.2022లో తోట చంద్రయ్య పైన వైసిపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు కత్తులతో దాడి చేశారు. గడిచిన కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనలో ఇదే గ్రామానికి చెందిన జివిశెట్టి వెంకటేశ్వర్లు, జీవిశెట్టి కోటేశ్వరరావును అక్కడ ప్రత్యర్థులు చంపేశారు.. ఇలా ఆ ఊరు మొత్తం కూడా రక్తపాతం అవుతూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: