
2015 మే 31న ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామం తెలుగు రాష్ట్రాలను గట్టిగా కుదుపేసింది .. ఇక అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి తరఫున గెలుపు బాధ్యతలను తీసుకున్నారు .. అయితే , వేంకు మద్దతు తెలిపాలంటూ నామినేట్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇవ్వబోతుండగా ఏసీబీకి చిక్కారన్నది అభియోగం ... అయితే ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణలో ఉంది .. ఇప్పటికే కొన్నిసార్లు రేవంత్ విచారణకు కూడా వెళ్లారు .. అయితే 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన రేవంత్ 2023 ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు .. అయితే 2017 లో ఓటుకు నోటు కేసు నమోదైన సమయంలో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు .. అలాగే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన .. ఇప్పుడు 2024లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ..