తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక విషయంలో మంత్రులు హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు. తాజాగా తెలంగాణ సచివాలయంలో క్యాబినెట్ హాలు వద్ద ఈరోజు ఉదయం ఒక కీలకమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ సడన్గా కళ్ళు తిరిగే పడిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా  ఆందోళనకు లోనయ్యారు. అయితే మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు.


వెంటనే అక్కడ ఉండే సిబ్బంది సైతం మంత్రి కొండా సురేఖను మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకువెళ్లి మరి ప్రాథమిక చికిత్స అందించారట. ఇక వైద్య పరీక్షల అనంతరం మంత్రి కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొండ సురేఖ అలా పడిపోవడానికి ముఖ్య కారణం లో బీపీ వల్లే ఆమె పడిపోయినట్లుగా వైద్యులు తెలియజేశారు. అందుకు సంబంధించి తక్షణమే ఇంజక్షన్ చేయడంతో పాటుగా కొంతమేరకు విశ్రాంతి తీసుకోవడంతో మంత్రి కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.


క్యాబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్న సమయంలో అస్వస్థకు గురి అవ్వడంతో కొండా సురేఖ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలియజేయడంతో ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఇక అధికారులు, అభిమానులు సైతం మంత్రి కొండా సురేఖ ఆరోగ్యం తిరిగి పూర్తిస్థాయిలో కోలుకోవాలంటు తెలియజేస్తున్నారు. ఇటీవలే కాలంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ  మెరుగైన పాలన అందించాలని  సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మంత్రులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి యొక్క పనితీరును బట్టి మరి ర్యాంకులు ప్రకటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: