
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మూడు పదవులతో ముగిసింది. రాజభవన్లో గడ్డం వివేక్ - అడ్లూరి లక్ష్మణ్ - వాకిటి శ్రీహరి ముదిరాజ్ లతో కొత్త మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 15 కు చేరింది. మరో మూడు ఖాళీలు ఉన్నాయి. మంత్రులను తప్పించడం లేదా సేకరణ మార్చడం లాంటి పనులు ఏమి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పెట్టుకోలేదు. ఎవరికీ కేటాయించని శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు మాత్రం ఆవేశంలో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి సర్ది చెప్పేందుకు మీనాక్షి నటరాజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఇళ్లకి వెళ్లి బుజ్జగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి రాజీనామా లేక పంపాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాము మంత్రి పదవి కోసం పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఈ మూడు పదవులతోను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు .. గ్రేటర్ హైదరాబాద్‌కు మంత్రి పదవి రాలేదు అలాగే మైనార్టీ కి కూడా మంత్రి పదవి కేటాయించలేదు. ఆ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. రేవంత్ రెడ్డి మూడు పదవులను భర్తీ చేయడానికి ఏకంగా ఏడాదిన్నర సమయం తీసుకున్నారు. మరి మిగిలిన మూడు పదవులు భర్తీ చేయడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు