చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర 2025 కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది .. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసేలా విశాఖ తీరంలో లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు సర్వం సిద్ధమవుతుంది .. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేసేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు .. అలాగే యోగాంధ్రతో రెండు గిన్నిస్ రికార్డుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలిపారు .. వైజాగ్ లో 24 కిలోమీటర్ల పరిధిలో  3 లక్షల 19 వేల మంది యోగా చేసేలా ఏర్పాటులు  చేస్తున్నారు ..
 

అలాగే యోగా మానవ జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అంటున్నారు .. అలాగే భవిష్యత్తులో ఆఫ్లైన్ , ఆన్లైన్ శిక్షల కోర్సులు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు . అయితే యోగ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్ , టీ షర్ట్లు ఇవ్వనున్నారు .. అలాగే యోగ డే నేపథ్యంలో విశాఖపట్నంలో అణువణువు నిఘా  పెట్టారు పోలీసులు .. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు .. ప్రధానంగా వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అదన‌పు భద్రతను కూడా ఏర్పాటు చేశారు .. రెండు వేలకు పైగా సిసి కెమెరాలను కమాండ్ కంట్రోలకు అనుసంధానం చేశారు .. అలాగే డ్రోన్లు , బాడీ వార్న్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ..


అంతేకాకుండా కీలక రూట్లో ఐదు కిలోమీటర్ల రేడియేషన్ లో నో ఫ్లయింగ్ జోన్ .. రెడ్ జోన్ గా డిక్లేర్ చేశారు .. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 12 వేల మంది సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు .. అలాగే ప్రధాన మోడీ యోగాసనాలు వేసే వేదికను SPG తమ ఆధీనంలోకి తీసుకున్నారు .. అలాగే ఆ వేదిక మొత్తం నిఘా నీడలో ఉండేలా పలు కీలక ఏర్పాట్లు చేశారు .. ఎక్కడైనా చిన్న అనుమానం ఉన్న కూడా ట్రాఫిక్ జామ్ అయినా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం అందేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: