ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తాజాగా క్రిమినల్ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. గత నెల 22వ తేదీన మధురైలో జరిగిన మురుగన్ భక్తుల ఆధ్యాత్మిక మహాసభలో సైతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు చాలామంది  ఫైర్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా కోర్టు విధించిన నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపణలు కూడా  వినిపిస్తున్నాయి.. ఈ సమయంలోనే అటు పవన్ కళ్యాణ్ తో పాటుగా బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నమలై , హిందూ మున్నాని వంటి నేతల పైన కూడా ఈ క్రిమినల్ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.ఈ కేసు మధురై లోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనట్లుగా సమాచారం.


ఇక పవన్ కళ్యాణ్ పైన ఫిర్యాదు చేసింది ఎవరంటే ఎస్. వంజినాధన్. ఈయన మధురై ప్రాంతంలో హార్మోనిక్ కోఆర్డినేటర్ గా ఉన్నారట. అలాగే ఒక న్యాయవాదిగా కూడా ఉండడంతో ఆయా తన ఫిర్యాదులో ఈ సభలో చేసిన ప్రసంగాలు ఆమోదించినటువంటి తీర్మానాలను సైతం మద్రాస్ హైకోర్టు విధించినటువంటి కొన్ని నిబంధనలను సైతం ఉల్లంఘించారనే విధంగా ఆరోపణలను  చేశారు. హైకోర్టు ఈ సభను చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన కానీ రాజకీయ మత ప్రచారాలు పైన నిషేధం విధించింది.


పవన్ కళ్యాణ్ మీద నమోదైన సెక్షన్ కేసు ఏమిటంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద 196(1)(a),299,302,353(1)(b)(2) కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.. ఇందులో ప్రధాన నిందితులుగా కదేశ్వర సుబ్రహ్మణ్యం, హిందూ మున్నాని, ముత్తు కుమార్, పవన్ కళ్యాణ్, అన్నమలై .. వీటితో పాటుగా ఇతర సంఘపరివారికి చెందిన నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు. మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: