
అయితే ఇప్పుడు విజయ్ పార్టీ తమిళనాడులో ఒంటరిగా పోటీకి వెళుతుందా ? లేక ఏదో ఒక కూటమిలో చేరుతుందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. మొన్నటి ఓ సర్వేలో సీఎం అభ్యర్థిగా చాలామంది తమిళులు మరోసారి స్టాలిన్ కే ఓటు వేశారు .. ఆ తర్వాత స్థానంలో కూడా విజయ్ లేరు .. ఇక ఎన్నికలకు సంవత్సరం టైం ఉంది కాబట్టి ఏమీ చెప్పలేం . ఇప్పటికే టీవీకే పార్టీ తొలి మహానాడు ను జరుపుకుంది పార్టీ స్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాదిక జనం వచ్చారు .. విజయ్ కూడా సీరియస్ రాజకీయ నాయకుడిగానే కనిపించారు . ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు కూడా బడుగు బలహీన వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకునేలానే ఉన్నాయి .
పాలను పంచుకోవడం, అధికారాన్ని పంచుకోవడం .. ఇది విజయ్ పార్టీ నినాదం .. అయితే రాజకీయాల్లోకి వచ్చేస్తున్న అని వెనుక తగ్గిన రజినీకాంత్ , రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన కమలహాసన్ వంటి దిగ్గజ నటుల తరహాలో కాకుండా విజయ్ తన పేరులో పార్టీ పేరులోని విజయాన్ని అందుకుంటారా ? లేదా ? అనేది వచ్చే సంవత్సరం తేలనుంది . ఇక ఇప్పుడు తాజాగా తమ అధినేత విజయ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది విజయ్ పార్టీ ..సహజంగా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్లే టీవీకే లోను వ్యవస్థాపకుడు సీఎం అభ్యర్థి అయ్యారు .. ఆయనను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంట్టు టీవీకే కార్య నిర్వాహ మండలి తీర్మానం చేసింది .. ప్రస్తుతానికి అయితే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్టు విజయ్ పార్టీ ప్రకటించింది . ఇక మరి ఎన్నికలు దగ్గరికి వచ్చే సమయానికి తమిళనాడులో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో చూడాలి .