బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడే మాటలు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ముఖ్యంగా కేటీఆర్ కి వ్యతిరేకంగా కవిత చేసే కామెంట్లు ఇద్దరి మధ్య చెడింది అనేదానికి ఉదాహరణలుగా మారుతున్నాయి.అయితే అలాంటి ఎమ్మెల్సీ కవిత రీసెంట్ గా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.. చిరంజీవి వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ కవిత చేసిన కామెంట్లు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.మరి కవిత అలా ఎందుకు మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. నన్ను బిజెపి వాళ్లు కెసిఆర్ గారి మీద ఉన్న కోపంతోనే జైల్లో పెట్టించారు. అయితే నాన్న వల్ల నేను జైలు పాలయ్యానని బాధపడి నన్ను బయటకి తీసుకురావడం కోసం నాన్న ఒకానొక దశలో బీఆర్ఎస్ ని బీజేపీలో విలీన చేద్దాం అనుకున్నారు.కానీ ఈ విషయం నాకు తెలిసాక వద్దని మా ఆయనకు చెప్పి నాన్న దగ్గరికి వెళ్లి  ఈ విషయం చెప్పమన్నాను. సంవత్సరమైనా సరే జైల్లోనే ఉంటాను కానీ బిజెపిలో విలీనం వద్దని చెప్పాను. దాంతో నాన్న వెనక్కి తగ్గారు. కేవలం నన్ను బయటకు తీసుకురావడం కోసమే నాన్న ఆ నిర్ణయం తీసుకున్నారు. 

కానీ ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేసినప్పుడు ఆ పార్టీ తరఫున నిలబడ్డ కార్యకర్తలు అందరూ రోడ్డున పడతారు.కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని నేను వద్దని చెప్పాను. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపిన సమయంలో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆరోజు చిరంజీవి తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోకూడదని మనల్ని నమ్మిన కుటుంబాలను రోడ్డు మీద పడేయకూడదు అనే ఉద్దేశంతో తోనే బిజెపిలో విలీనానికి నేను ఒప్పుకోలేదు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసింది కవిత. ఇక కవిత మాటలను బట్టి చూస్తే బీఆర్ఎస్ బిజెపి లో విలీనమవ్వాలనుకున్న మాట నిజమేనని.. కానీ కవిత నిర్ణయంతో కేసీఆర్ వెనక్కి తగ్గినట్టు అర్థమవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: