
మొదటి వీడియోలో తల్లిదండ్రులు విధించిన ఆంక్షలు కట్టుబాట్లు గురించి వివరించిన రెండో వీడియోలో మరికొన్ని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చేలా చేసింది. టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్యకు ముందు తీవ్ర మానసిక శోభను ఎదుర్కొన్నది అంటూ వెల్లడించింది హిమాన్షిక. తన ఇంట్లో పూర్తిగా ప్రశాంతతను కోల్పోయిందని చివరికి ఆ ఇంట్లో పెట్టే అంశాలకు రాధిక తగ్గిందంటూ తెలియజేసింది హిమాన్షిక. నిబంధనలకు అనుగుణంగానే జీవిస్తానని చెప్పినా కూడా రాధిక తండ్రి వినలేదని వివరించింది. ఆమె తండ్రి చంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా వివరించింది.
రాధిక చాలా మంచి అమ్మాయిని ఆమె తండ్రి మతిస్థిమితం లేని వాడని వెల్లడించింది హిమాన్షిక. మొదటి వీడియోలో హిమాన్షిక మాట్లాడుతూ రాధిక ఏం చేసినా కూడా తల్లిదండ్రులకు చెప్పాలి వ్యక్తిగత స్వేచ్ఛ లేదని.. తల్లిదండ్రుల మీద ఇష్టంతో తనకు ఉన్న ఇష్టాలను కూడా పక్కన పెట్టేదని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం వంటివి కూడా మానేసిందని తెలిపింది. ఎన్నో కట్టుబాటులతో ఉక్కిరిబిక్కిరి చేసేవారు అంటూ వెల్లడించింది.. అయితే ఈ వ్యాఖ్యలను రాధిక కుటుంబ సభ్యులు మాత్రం తోసిపుచ్చారు.ఒకవేళ అన్ని అంశాలు పెట్టి ఉంటే ఇంట్లో నుంచి బయటికి రాధిక వచ్చేదా అంటూ ఆమె బంధువులు వెల్లడిస్తున్నారు. రాధిక కోసం కుటుంబం చాలా డబ్బులను ఖర్చు చేసిందని మీడియాలో కేవలం తప్పుడు కథనాలు మాత్రమే వినిపిస్తున్నారు అంటూ బంధువులు తెలుపుతున్నారు. రాధిక పెళ్లి విషయంలో తన తండ్రి దీపక్ యాదవ్ చాలా భయపడ్డారని.. కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన సంబంధం కాకుండా ఇతర కులం అబ్బాయిని వివాహం చేసుకుంటే పరువు పోతుందని ఘర్షణ జరిగిందని.. రాధిక కూడా అంగీకరించకపోవడంతో ఆ కోపంతోనే దీపక్ ఇలాంటి పనికి పాల్పడ్డారంటూ రాధికఇంటి పక్కన ఉండే వ్యక్తులు తెలియజేశారు.