వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు కీలకమైన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందినటువంటి నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డి వంటి వైసీపీ నేతలను సస్పెండ్ చేసినట్లుగా పార్టీ ప్రకటించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారని వీరిపైన పలు రకాల ఆరోపణలు రావడంతో వైసిపి పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



వైసిపి క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకే హిందూపురం నియోజకవర్గంలో ఉండే ఈ ఇద్దరు నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ నేత మాట్లాడుతూ.. 2029లో హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా తనకు టికెట్ లభిస్తుందంటూ నవీన్ నిశ్చల్ ఇటీవలే బహిరంగంగా తెలియజేశారు. అయితే ఈయన ప్రకటన పైన కొంతమంది వైసీపీలో అసంతృప్తికి గురయ్యారని.. హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే ఈ నేతల పైన సస్పెండ్ వేశారనే విధంగా  వార్తలు వినిపిస్తున్నాయి.


2024 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో టిడిపి పార్టీ నుండి పోటీ చేసిన బాలకృష్ణ మీద దీపిక పోటీ చేయగా బాలయ్య విజయాన్ని అందుకున్నారు. నవీన్ నిశ్చల్ హిందూపురంలో బలమైన నేతగా పేరు సంపాదించారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడంతో హిందూపురంలో రాజకీయాల హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాగే మరొకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా నిన్నటి రోజున కొంతమంది జడ్పీ చైర్మన్లు  కలిసి కృష్ణాజిల్లాలో జరిగిన హారిక పైన దాడికి ఖండించారు. జడ్పీ చైర్మన్ హారికకు అండగా నిలిచిన వైసిపి పార్టీకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అలాగే రాబోయే ఎన్నికలలో వైసిపి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలి అంటూ వైఎస్ జగన్ నేతలకు సూచించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: