
వాచ్‌మెన్ మరణించిన కేసులో ఇటివలే బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. ఉద్యోగి ప్రయాణాన్ని కూడా ఉద్యోగంలో భాగంగానే పరిగణించాలని అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. సదరు కంపెనీ అతడికి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. "Course of Employement" పరిధిలో ఇది వర్తిస్తుంది. ఉద్యోగి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం కూడా పనిచేసే సమయంలో జరిగిందే అని భావించాలి. ఇందులో ఎంప్లాయర్ బాధ్యత ఏంతంటే.. కంపెనీ/సంస్థ తమ ఉద్యోగి ప్రయాణ సమయంలో జరిగిన ప్రమాదానికి బీమా పరిధిలోకి తీసుకొని పరిహారం చెల్లించాలి.
ఇది కార్మికుల హక్కులకు పెద్ద బలం.భవిష్యత్తులో కంపెనీలు బీమా మరియు ఇతర భద్రత చర్యలపై మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఉద్యోగులు పని అనంతర ప్రయాణంలో కూడా ఆఫీషియల్ కవరేజ్ ఉంటుందని ఇది సూచిస్తుంది. ఈ తీర్పు కార్మిక హక్కుల పరిరక్షణలో మైలురాయిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల పరిహార చట్టం 1923 కింద పరిహారం క్లెయిమ్ చేసుకోవడంపై చాలా కాలంగా ఉన్న అస్పష్టతపై ఇటీవల సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రమాదం ఉద్యోగ సంబంధితంగా ఉండాలి అంటే.. ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులు, సమయం, స్థలం, ఉద్యోగం మధ్య ఒక స్పష్టమైన 'నెక్సస్' అనగా ప్రత్యక్ష సంబంధం ఉండాలని కోర్టు క్లారిటీగా చెప్పింది.