జగన్ కి తమ సత్తా చూపించాలనుకున్నటువంటి వాళ్లలో.. కార్యకర్తలు సైతం వాలంటరీల వ్యవస్థను పెట్టి మాకు విలువ లేకుండా చేశారని అన్నటువంటిది తెలియజేశారు. దీంతో వారందరూ ఓటుకి దూరమయ్యారు ఓట్లు వేయించడానికి కూడా దూరమయ్యారు. దీని ఫలితమే జగన్ ఓటమికి కారణమయ్యిందని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్ తమ సామాజిక వర్గ నాయకులను పక్కన పెట్టి మరి ఇతర కులాల వారికి పెద్దపీట వేశారని.. చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. కేవలం రెడ్ల మంత్రులను మారుస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులను మార్చలేదని విధంగా అప్పట్లో చాలా నెగెటివిటి వినిపించింది.


దీంతో ఎన్నికలలో తమ సత్తా చూపించాలని .. జగన్ కు తమ సామాజిక వర్గ నాయకుల మీద కమ్యూనిటీ లేనప్పుడు తమ సత్తా చూపించాలని చాలామంది నేతలు అనుకున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా ఎదురు దెబ్బ వేశారు. అలా రాయలసీమలో కూడా టిడిపి పార్టీ చరిత్రలోనే రానని సీట్లను కూడా గెలుచుకున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్ సామాజిక వర్గానికి సంబంధించి విలువ తెలిసి వస్తుందా? లేదా అన్నటువంటి అంశం విషయానికి వస్తే.. ఈసారి ఎవరి రాజ్యము ఉండదని..అందరిని కలుపుకెళ్లాలనే విషయాన్ని తెలుసుకున్నట్టు కనిపిస్తోంది వైసిపి.


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొట్టుకున్న నాయకులు ఇప్పుడు కలుసుకున్నారు.. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు కంచుకోట లాంటి జిల్లాను  ఓడిపోయేలా చేశారు.2014 లోను బలంగా ఉంది ,2019 లో కూడా వైసిపి పార్టీకి బలంగా ఉన్నది. అయితే అలాంటిది 2024లో ఘోరంగా ఓడిపోయింది. ఇందుకు కారణం నాయకుల యొక్క అహంకారాలు వారి యొక్క వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇటీవలే జైలు నుంచి వైసీపీ నేత  కాకాని బెయిల్ నుంచి బయటికి వచ్చాక అనిల్ కుమార్ యాదవ్ కలవడం అలా అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. గతంలో అనిల్ కుమార్ యాదవ్ ని పార్టీ నుంచి పక్కన పెట్టేయాలని చూశారు..ఇలా వీరిలో వీరు తగాదాలు వల్ల వైసీపీ పార్టీని నెల్లూరులో ఓడిపోయిన చేశారు. దీంతో ఇప్పుడు నాయకులందరూ ఏపీలో వైసీపీ పార్టీకి సంబంధించిన వారందరిని కలుపుకొని 2029 ఎన్నికలలో విజయాన్ని అందుకోవాలని టీమ్ గా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: