
ఉదాహరణకు … బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ. రాజ్యసభ సభ్యత్వాలనే త్యాగం చేసి టీడీపీ తలుపు తట్టారు. కానీ ఎనిమిది నెలలు గడిచినా వారిని ఎక్కడా ప్రోత్సహించలేదు. కారణం స్పష్టమే – వారికి ప్రాధాన్యం ఇస్తే అక్కడి సీనియర్ టీడీపీ నేతలు డైల్యూట్ అవుతారనే భయం. అందుకే వీరిని సైడ్ లైన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ సీట్లు వదులుకుని కూడా కొందరు టీడీపీ వైపు మొగ్గారు. బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ – వీరిలో జయమంగళ ఒక్కరే నేరుగా టీడీపీలో చేరగలిగారు. మిగిలిన ఇద్దరి రాజీనామాల ఆమోదం ఇంకా పెండింగ్ లోనే ఉంది. పార్టీ చేర్చుకోవడమే కాకుండా, వారికి అవకాశాలు ఇవ్వడంలో కూడా అనుమానాలే ఎక్కువ. చంద్రబాబు ప్రోత్సహించాలని ఉన్నా, స్థానికంగా ఉన్న నేతలు ప్రతిఘటిస్తున్నందున వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
ఇక క్షేత్రస్థాయిలో అసలు టీడీపీ కేడర్ కూడా జంపింగులను సీరియస్‌గా పట్టించుకోవడంలేదు. “మేము ఏళ్ల తరబడి పార్టీ కోసం పోరాడుతుంటే, ఎన్నికల ముందు లేదా తర్వాత కుర్చీ వదులుకుని వచ్చినవాళ్లకే ప్రాధాన్యం ఇస్తారా?” అనే అసంతృప్తి కేడర్ లో ఎక్కువైంది. దీంతో జంప్ చేసిన నేతలు నిజంగానే ఉసూరుమంటున్నారు. మొత్తానికి, ఈసారి రాజకీయాల్లో జంపింగులు చేసిన నేతలకు ఆశించిన భవిష్యత్తు కనబడడం లేదు. అవకాశాలు కోసం జంప్ చేసినా, ఇప్పుడు ఆ అవకాశాలే కరువైపోవడం పెద్ద వ్యంగ్యంలా మారింది. కాబట్టి, ఇకపై జంప్ చేయాలని భావించే నేతలు రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే!