జూనియర్ నందమూరి తారక రామారావు (Jr. NTR) రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో విస్తారంగా వైరల్ అవుతున్నాయి. “ ఎన్టీఆర్‌ వస్తున్నారు .. తన సొంత పార్టీ పెడతారు.. టీడీపీతో దూరం పెరుగుతోంది” అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? ఈ వార్తల వెనుక గేమ్ ఎవరిది? రాజకీయ పుకార్ల అసలు స్టోరీ ..  ఇప్పటికే కొన్ని నెలలుగా జూ. ఎన్టీఆర్‌ ఎంట్రీ గురించి వదంతులు సాగుతున్నాయి. “అయన త్వరలోనే రాజకీయాల్లోకి దిగుతారు” అనే టాక్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఎన్టీఆర్‌కి అత్యంత సమీప వర్గాలు చెబుతున్నది మాత్రం వేరే. తక్షణమే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, కనీసం 10 ఏళ్లు అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.


ఎన్టీఆర్‌ వైఖరి .. గతంలో జూ. ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలలోనే ఆయన చెప్పారు – “మా కుటుంబం రాజకీయ కుటుంబమే. నాకు సమయం, పరిపక్వత, జ్ఞానం ఉన్నప్పుడు తప్పక రాజకీయాల్లోకి వస్తా. కానీ అప్పటి వరకు నేను టీడీపీ కార్యకర్తగానే ఉంటా” అని. అంటే ఆయన భవిష్యత్తులో రాజకీయాలు ఖాయం అని చెప్పినా, ఇప్పుడే ఎంట్రీ గురించి మాట్లాడలేదన్న మాట. వైసీపీ మైండ్ గేమ్? .. రీసెంట్‌గా ఒక టీడీపీ ఎమ్మెల్యే – జూ .ఎన్టీఆర్  అభిమానుల మధ్య చిన్న వివాదం చెలరేగింది. దాన్ని ఉపయోగించుకుని “ ఎన్టీఆర్‌ సొంత పార్టీ పెడతాడు” అని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నట్లు టాక్ ఉంది. అంతేకాదు, కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇదే న్యూస్‌ను వైసీపీ లైన్‌లో పుష్ చేస్తున్నాయని రాజకీయ వర్గాల అంచనా.



టీడీపీ – ఎన్టీఆర్‌ సంబంధం .. నిజానికి ఎన్టీఆర్‌కి టీడీపీతో ఎప్పటినుంచో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కానీ మీడియా మాత్రం అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని చూపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అవమానం జరిగి, ఆ సమయంలో ఎన్టీఆర్‌ బహిరంగంగా స్పందించకపోవడంతో టీడీపీ వర్గాల్లో కొంత అసంతృప్తి కనిపించింది. అయినా కూడా ఆయన అభిమానులు ఎక్కువగా గట్టి టీడీపీ మద్దతుదారులే. జూ.ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎప్పుడైనా అడుగుపెట్టినా – అది టీడీపీలో చేరడమో, లేదా సొంత పార్టీ పెడదామనుకున్నా – అభిమానులు ఆయన వెంటే ఉంటారని క్లారిటీ ఉంది. అందుకే ఈ “ఎన్టీఆర్‌ తక్షణ ఎంట్రీ” అనే ప్రచారాన్ని చాలా మంది ఒక రాజకీయ మైండ్ గేమ్గానే చూస్తున్నారు. అందుకే జూ. ఎన్టీఆర్ ఎంట్రీ వార్తలపై ఎక్కువ ఎక్సైట్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఇప్పటికి కేవలం వైసీపీ ప్రోపగాండా మాత్రమే. “ఎన్టీఆర్‌ ఎంట్రీ ఖాయం.. కానీ టైమ్ ఇంకా రాలేదు” అనేది గ్రౌండ్ రిపోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: