ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో లిక్కర్ స్కామ్ రోజుకోక మలుపు తిరుగుతోంది.. ఈ వ్యవహారం లో రోజు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్  మోహన్ రెడ్డి హయాం లో జరిగినటువంటి ఈ స్కామ్ లో  కొత్త కొత్త పేర్లు కొత్త డోల్ల కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సిట్ అధికారులు  చిత్తూరు, తిరుపతి, హైదరాబాదు లో విపరీతమైన సోదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వంటి వారికి సంబంధించిన కంపెనీలు నివాసాల్లో విపరీతమైనటు వంటి సోదాలు నిర్వహించారు. ఇందులో ఒకే అడ్రస్ పై మూడు డొల్ల కంపెనీలు ఉన్నట్టు బయటకు వచ్చింది. చెవిరెడ్డి కి తో పాటు సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాములు అయ్యారని తెలుస్తోంది. 

ఈ విధంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది గత కొంత కాలంగా నాయకులను కలవరపెడుతోంది. ఇదే తరుణంలో ఈ స్కాంకు సంబంధించి టీడీపీ మంత్రి నారా లోకేష్ కు కూడా సంబంధాలు ఉన్నాయని  వైసిపి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ఎదుట ఆరోపించారు. లిక్కర్ కేసు ప్రచారం లో ఉన్న ప్రద్యుమ్న అనే వ్యక్తి కి  నారా లోకేష్ కు బాగా పరిచయం ఉందని అన్నారు.. ప్రద్యుమ్న  నడిపినటువంటి స్టూడియో ఎన్ ఛానల్ ను నారా లోకేష్ ప్రమోట్ చేశారని ఆయన తెలియజేశారు.

 అలాగే ఈ ఛానల్ లో క్రియాశీలక పాత్ర ప్రద్యుమ్న పోషించారని, ఆయన డైరెక్టర్ గా కూడా వ్యవహరించారని  అన్నారు. ఈ విధంగా జగన్ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి  వివిధ పేర్లు బయటకు వస్తున్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ పేరు బయటకు తీసుకురావడం అంతా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మంత్రి నారా లోకేష్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: