ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్  భారీగా సుంకాలను ఇష్టానుసారంగా పెంచేయడంతో అన్ని దేశాలు భయపడిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యాను బద్ధ శత్రువుగా పరిగణించారు. ఆ దేశంతో వ్యాపారం, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, క్రూడ్ ఆయిల్ వంటివి కొనుగోలు చేసిన దేశాలు అన్నిటి పైన ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండియా పై 50% అదనపు టారిఫ్లను కూడా విధించారు ట్రంప్. మొదట 25% సరిపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత మరో 25% అదనంగా వడ్డించారు. ఒక రకంగా ఇది భారత్ కి బెదిరింపు అయినప్పటికీ మోదీ  మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా సవాల్ చేస్తున్నారు.


మోదీ ఈనెల 23 నుంచి 29 వరకు న్యూయార్క్ లో జరగవలసిన ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరు కావడం లేదు. మోదీ స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న ప్రసంగించబోతున్నారు. మోదీ  అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా అమెరికాకు ఒక హెచ్చరిక వంటిదని చెప్పవచ్చు. ఐక్యరాజసమితి సమావేశానికి ప్రపంచంలో ఉండే ఎంతో మంది నాయకులు తమ దేశ వైఖరిలను తెలియజేయడానికి ఒక వేదికగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మోదీ హాజరు కాకుండా ఆయన స్థానంలో మంత్రి జైశంకర్ హాజరవుతూ భారతదేశం తన వైఖరిని స్పష్టం చేయనుంది.


దేశంలో ముఖ్యమైన అంశాల పైన దృష్టి పెట్టడానికి కొన్నిసార్లు నాయకులు విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకుంటారు. ప్రస్తుతమైతే అమెరికా పర్యటన రద్దు కావడానికి ముఖ్య కారణం ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అన్నట్టుగా వినిపిస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఉన్నత స్థాయి పర్యటనలు రద్దు చేయడానికి భద్రతా కారణాలు లేదా ఆరోగ్య సమస్యలు, అత్యవసర పరిస్థితులే కారణాలు ఉంటాయి. మోదీ ఏలాంటివి లెక్కచేయకుండా అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. మోదీ 11 ఏళ్ల పదవీకాలంలో 2014, 2019, 2020, 2022లో UNGA లో ప్రసంగించారు.


 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు భారత్ గురించి మోడీ గురించి రోజుకోకల మాట్లాడుతున్నారు.. ఒకరోజు భారత్ శత్రువు అని మరొక రోజు టాలీఫల మోత అయిపోలేదని , మరోసారి భారత ప్రధాని తనకు మంచి స్నేహితుడని గొప్ప ప్రధాని అవతారంటూ పొగిడేస్తున్నారు.. సుంకాల విషయంపై మాట్లాడుతూ తాము కావాలని పెంచలేదు.. ఇండియా, రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమరు కొనుగోలు చేయడం చూసి చాలా నిరాశ చెందాము.. ఈ విషయాన్ని భారత్ కి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు అందుకే సుంకాలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. నరేంద్ర మోడీ కూడా తన గొప్ప ప్రధాని అనడాన్ని ప్రశంసిస్తూ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

war