
ఈనెల 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్న ఐఫోన్ - 17 సిరీస్ మొబైల్స్ ధరలు కూడా ఈసారి భారీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఐఫోన్ 17 సిరీస్ మొబైల్ కి కొంత మేరకు వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వ్యతిరేకత అమెరికా నుంచి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఆపిల్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక నాజూకైన మొబైల్ ని రిలీజ్ చేయబోతోంది. దీనికి "ఐఫోన్ ఎయిర్ " అనే పేరు కూడా పెట్టారు. ఈ మొబైల్ చూడడానికి స్లిమ్ గానే ఉన్న బ్యాటరీ లైఫ్ మాత్రం ఆపిల్ కంపెనీ చెబుతున్న రేంజ్ లో లేదనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆపిల్ మాత్రం డే బ్యాటరీ లైఫ్ అంటూ చెబుతూ ఉన్న .. ఈ మొబైల్ గట్టిగా వాడితే కనీసం 5 గంటలకు మించి చార్జింగ్ రావడం లేదంటూ వాషింగ్టన్ పోస్ట్ తన రివ్యూలో వెల్లడించారు. ఆపిల్ 17 సిరీస్ మొబైల్ ఇంత స్లిమ్ మోడల్ లో వస్తుందని యూజర్స్ ఊహించలేదట.. అంతేకాకుండా ఫోల్డబుల్ మోడల్ లో వస్తుందని ఆశించారు యూజర్స్.. శాంసంగ్ మొబైల్ కి పోటీగానే ఐఫోన్ వస్తుందని ఎదురు చూశారు యూజర్స్.. కానీ వారందరినీ అసంతృప్తిని గురిచేసింది ఆపిల్.
ఇక ఆపిల్ 17 సిరీస్ ప్రో మాక్స్ ఫ్లాగ్ షిప్ మోడల్ లో ఉంటుందని ప్రకటించిన ఆపిల్ సంస్థ కానీ చివరికి ఈ మొబైల్ గూగుల్ పిక్సెల్ ఫోన్ ను తలపించే విధంగా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ధరల పైన కూడా చాలానే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి ఐఫోన్ మోడల్స్ పైన ఎక్కువగానే విమర్శలే వినిపిస్తున్నాయి. మరి యాపిల్ ఈ విమర్శలను ఎలా ఎదురుకుంటుందో చూడాలి.