
ఈ విషయం పైన మీడియా నిర్వహించినటువంటి సమావేశంలో ఆయేషా తల్లి ఇలా మాట్లాడారు..తమ కూతురి న్యాయం కోసం 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న ఈ కేసులో ఎలాంటి న్యాయం జరగలేదని ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు తెలిపారు.. మళ్లీ సత్యం బాబు పైన కేసు పెట్టి తమ అభిప్రాయం ఏంటి అంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు?. అసలు ఈ కేసు విచారణ ఈ ఏడాది జూన్ లోనే ముగిసిందని సిబిఐ ఒక సీల్డ్ కవర్ ద్వారా నివేదికను హైకోర్టుకు ఇచ్చింది.. ఈ రిపోర్ట్ కాపీలు అసలు చూడకుండనే ఈ కేసు గురించి అభిప్రాయం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించింది? ఆయేషా తల్లి. సిబిఐ కూడా మా బిడ్డకు ఎలాంటి న్యాయం చేయలేకపోతోంది అంటూ మాట్లాడుతోంది ఆయేషా తల్లి.
మా మత సాంప్రదాయాలను పక్కనపెట్టి మరి ఆయేషా రీపోస్టుమార్టంకి తాము సహకరించామని.. ఈ కేసు విషయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ కూడా స్పందించాలంటూ షంషాద్ తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి నివేదికను తమకు ఇవ్వాలని ఆదేశం మీద తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ వారు మాత్రం దిగువ కోర్టులో తేల్చుకోవాలని సూచించారు..అయితే హైకోర్టు మేరకు విజయవాడలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వీరికి ఇంతవరకు ఎలాంటి నివేదికలు అందలేదు.