తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన మాజీ ఇంచార్జ్ కోటా వినుత గడిచిన కొన్ని నెలల క్రితం తన కారు డ్రైవర్, పిఏ అయిన రాముడు హత్య కేసులో చిక్కుకోగా దంపతులిద్దరూ జైలుకెళ్ళి బెయిల్ పైన బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయం ఏపీ అంత సంచలనంగా మారగా ఇప్పుడు తాజాగా ఒక సంచలన లేఖతో మరొకసారి వార్తలలో నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ కూడా రాసింది. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేనటువంటి కొట్టే సాయి ప్రసాద్ అనే కార్యకర్తకు అసలు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ నిలదీసినటువంటి ఒక లేఖ ఇప్పుడు తీవ్రదుమారాన్ని రేపుతోంది



లేఖలో ఇలా రాస్తూ.. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి సాయి ప్రసాద్ ఇవ్వడం పై అభ్యంతరాన్ని తెలుపుతున్నాను ఈ విషయం పైన పురాలోచన చేయాలని విజ్ఞప్తి అంటూ వెల్లడించింది.. మహిళలంటే కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి నియమించడం మంచిది కాదని నాపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రధాన నిందితుడు ఈ సాయి ప్రసాద్ ఒకరని ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాయని .. తనకు జరిగిన ఇంత పెద్ద సమస్యను మీ దృష్టికి ఎవరు చేరనివ్వలేదని భావిస్తున్నాను..


జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నతనను భౌతికంగా హతం చేయాలని ,రాజకీయాలకు దూరం పెట్టాలని, క్యారెక్టర్ దెబ్బతీసేలా ఎన్నో కుట్రలు చేసిన కొట్టేసాయి ప్రసాద్ కు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు అంటూ వెల్లడించింది. నియోజవర్గంలో చాలామంది అర్హులు ఉన్నారని వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పురాలోచన చేయాలని కోరుతున్నాను అంటూ జనసేన మాజీ ఇంచార్జి కోట వినుత ఒక లేఖ ద్వారా తెలియజేశారు. జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయిన వినుత ఇప్పుడు లేఖ రాయడంతో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: