
నవరాత్రులలో మొదటి రోజు నుంచే అమ్మవారికి ప్రత్యేకించి పూజ చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి, సుబ్రమైన దుస్తులు ధరించి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకమైన పూలతో అలంకరించి పూజ చేయడం మంచిది. అయితే ఈ పూజలో ఎరుపు రంగు గులాబీ పూలను వాడడం మంచిదని పండితులు సైతం తెలియజేస్తున్నారు. అమ్మవారికి ఆవు నెయ్యితోనే దీపం వెలిగించడం వల్ల మరింత అనుగ్రహం లభిస్తుందట. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తారు. కనుక అలా అలంకరణలో అలంకరించడం మంచిది.
గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పూజించడం వల్ల ఆ మాత అనుగ్రహం పొందవచ్చు. అమ్మవారిని భక్తితో పూజించి ఆమెకు ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా ఉంచితే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దుర్గాదేవికి కుంకుమతో పూజ చేసి హారతి ఇచ్చి ఇంటిల్లిపాది ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యాలు పెరుగుతాయని పండితులు సైతం తెలియజేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఒక్కో అలంకారంలో పూజలు నిర్వహించాలి.
1). బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ
2). గాయత్రీ దేవి అవతారం
3). అన్నపూర్ణాదేవి అవతారం
4). కాత్యాయనీ దేవి అవతారం
5). మహాలక్ష్మి దేవి అవతారం
6). లలితా దేవి అవతారం
7). చండీ దేవి అవతారం
8). సరస్వతి దేవి అవతారం
9). దుర్గాదేవి అవతారం.