టాలీవుడ్ మాస్ హీరో – రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ రెండు రంగాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఒకవైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో స్థిర స్థానం సంపాదించుకున్న బాలయ్య… మరోవైపు వరస సినిమాలతో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వయసు అరవై దాటినా ఆయనలోని ఎనర్జీ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. యాభై ఏళ్ళ సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న తర్వాత కూడా బాలయ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నారు.

మంత్రి పదవిపై హాట్ టాపిక్ :
ఇటీవల బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఏపీలో పెద్ద చర్చగా మారింది. అసెంబ్లీలో ఆయన హాజరు తక్కువగానే ఉన్నా, ఆయన రాజకీయ ప్రాధాన్యం మాత్రం చాలా ఉంది. “బాలయ్యకు మంత్రి పదవి కావాలా?” అన్న ప్రశ్న ప్రస్తుతం రాజకీయ సర్కిల్స్ లో పజిల్‌గా మారింది. ఆయన స్వభావం ఏంటంటే - ‍‍పదవులపై అంతగా ఆసక్తి చూపించరు. తన కుటుంబం ఇప్పటికే కీలక స్థానాల్లో ఉందని ఆయనకు తెలుసు. కానీ ఫ్యాన్స్ మాత్రం “మా బాలయ్య మినిస్టర్ కావాలి” అంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్ ఎక్కడి నుంచి మొదలైందో అనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. టీడీపీ వర్గాలు సైతం దీనిపై లోతుగా ఆరా తీస్తున్నాయట. ఎందుకంటే ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక్క సీటు అందరినీ ఊరిస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

మహా రాజయోగం బాలయ్యకు! :
బాలయ్యకు జ్యోతిష్యంపై విశేష నమ్మకం ఉంది. ఆయన స్వయంగా ముహూర్తాలు చూసుకుని పనులు చేసే స్థాయిలో ఆ శాస్త్రాన్ని అభ్యసించారు. పండితుల మాటల్లో బాలయ్య జాతకంలో ప్రస్తుతం మహా రాజయోగం నడుస్తోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆయనకు వరస విజయాలు, బిరుదులు, పౌర పురస్కారాలు రావడం కూడా దీనికే ఉదాహరణగా చూపుతున్నారు. రాజకీయంగా కూడా ఆయన వాయిస్ పార్టీ లో బలంగా వినిపిస్తోంది.

దైవేచ్చ అని చెప్పిన బాలయ్య :
మంత్రి పదవి డిమాండ్‌పై బాలయ్య కూల్ గా స్పందించారు. “దైవేచ్చ” అనే ఒక్క మాటతో ఆయన తన పొలిటికల్ లెక్క చెప్పేశారు. అంటే జాతకంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నదే ఆయన భావం. అయితే ఆయన “లేదు” అని కూడా చెప్పకపోవడంతో ఈ డిమాండ్ చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కానీ ఈ డిమాండ్ ఇప్పుడు రాజకీయ వేదికపై హీట్ పెంచేస్తోంది.

ఒక్క సీటు.. పలు ఆశలు :
ఏపీ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఒక్క సీటు కోసం ఇప్పటికే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పేరు కూడా వినిపించింది. ఇప్పుడు బాలయ్య పేరు కూడా చేరడంతో సీన్ మరింత ఇంట్రెస్టింగ్ అయింది. సినీ, రాజకీయ రంగాల్లో ఒకే సారి హంగామా సృష్టించే బాలయ్య మినిస్టర్ అవుతారా? అన్నది ఇప్పుడు మాస్ టాక్‌గా మారింది. మొత్తానికి బాలయ్య మంత్రి డిమాండ్ చుట్టూ ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: