
మరి మంత్రిగా తన బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తుందో చూడాలి. ఒక ప్రముఖ క్రికెటర్ భార్య రాష్ట్రస్థాయి క్యాబినెట్లో మంత్రిగా చోటు సంపాదించడం ఇప్పుడు జాతీయస్థాయిలో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో రవాబా రాజకీయ ప్రస్థానం మరొక ఉన్నత స్థానానికి చేరిందని అభిమానులు , నియోజవర్గ ప్రజలు తెలియజేస్తున్నారు. క్రీడా నేపథ్యం కుటుంబంలో నుంచి ఇప్పుడు రాజకీయాలలోకి రాణించడంతో ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ పాలనలో కొత్త శక్తిని నింపే లక్ష్యంతోనే బిజెపి అధిష్టానం ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టినట్లు తెలియజేస్తుంది.
అలా మొత్తం మీద గురువారం రోజున ముఖ్యమంత్రి మినహా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత 26 మందిని క్యాబినెట్ లోకి కొత్తగా తీసుకున్నట్లు సమాచారం. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ నుంచి మొదటిసారి పోటీ చేయగా 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందుకుంది. రివాబా మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2019లో బిజెపి పార్టీలో చేరి రాజకీయాలలో యాక్టివ్ గా మారింది.