
ఇకపోతే, లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్ర జన్‌తా దళ్ (ఆర్జేడీ) పార్టీ ఇప్పటికే 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో కేవలం 60 మంది అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మిగిలిన స్థానాలపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతుండటంతో, కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నది ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ పార్టీ ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది బీహార్ ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతున్న సంఘటనగా నిలిచింది. గత ఎన్నికల్లో జేఎంఎం ఎప్పటికప్పుడు బీహార్-ఝార్ఖండ్ సరిహద్దు ప్రాంతాల నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ వచ్చింది. కానీ ఎక్కడ గెలవలేదు. కానీ ఈసారి పార్టీ ఎటువంటి స్థానంలోనూ పోటీ చేయకపోవడం రాజకీయ విశ్లేషకుల్లో కొత్త సందేహాలకు కారణమవుతోంది.
పార్టీ వర్గాల ప్రకారం, “కాంగ్రెస్–ఆర్జేడి మధ్య రాజకీయ కుతంత్రాలు, సీట్ల కేటాయింపులో అన్యాయం, మరియు కూటమి లోపల గౌరవాభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని స్పష్టంచేశారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.ఇక రూలింగ్ బీజేపీ ఈ పరిణామంపై తీవ్ర స్థాయిలో స్పందించింది. “ఝార్ఖండ్ ముక్తి మోర్చా తన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించింది. ఇది ఆ పార్టీకి మాత్రమే కాదు, మొత్తం జార్ఖండ్ గర్వానికి మచ్చగా నిలుస్తుంది” అంటూ బీజేపీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేదికలో రాజకీయ హీట్ మరింత పెరుగుతోంది. ఒకవైపు కూటమి విభేదాలు, మరోవైపు బీజేపీ దూకుడు — ఈ రెండింటి సమీకరణం వల్ల ఈసారి బీహార్ ప్రజలు చరిత్ర సృష్టించే ఎన్నికను చూడబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.