
అందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పే ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. నవీన్ పక్కా లోకల్ లీడర్. ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ ఉన్న వ్యక్తి. రెండు సార్లు ఓడినా వెనక్కి తగ్గకుండా ప్రజల్లో పనిచేసారు. ఆ క్రమంలో ఆయనకు సింపతీ ఫ్యాక్టర్ కూడా బలంగా పనిచేస్తోందని అంటున్నారు. “ఈసారి నవీన్ కే ఛాన్స్ ఇవ్వాలి.. చూడాలి ఆయన ఎలా పనిచేస్తారో” అన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో కాంగ్రెస్ ఉండటం కూడా ఆయనకు అదనపు ప్లస్. ప్రజలు “పవర్ ఉన్న నాయకుడు ఉంటే అభివృద్ధి జరగొచ్చు” అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా నవీన్ యాదవ్ సామాజిక వర్గ పరంగా కూడా బలమైన లీడర్. మజ్లీస్ నుంచి కూడా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మౌన మద్దతు ఉందని చెబుతున్నారు. బీసీ ప్లస్ ముస్లిం ఓటు బ్యాంక్ కలయిక ఈ ఉప ఎన్నికలో కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే... పార్టీ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాగంటి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టి సానుభూతి గాలి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అర్బన్ ఓటర్లు సానుభూతి కంటే పనితీరు, అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే సూచిస్తోంది. అంతా బట్టి చూస్తే... ఈ పోటీ హోరాహోరీగా సాగినా, చివరి లైన్‌లో నవీన్ యాదవ్ గెలుపు గాలి స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పాలనకు ఈ ఫలితం బూస్టర్‌గా మారే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ జోరు, నవీన్ మాస్ ఇమేజ్, మజ్లీస్ మద్దతు కలయికతో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలంగా దూసుకుపోతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. “జూబ్లీ హిల్స్ జోరు.. నవీన్ గెలుపు దిశగా కాంగ్రెస్ పయనం..!