జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రజాదరణ గురించి చెప్పాల్సిన పనిలేదు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పేరును ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో తీసుకువస్తూనే ఉన్నారు. అవి మంచి విషయాలు మీద అయితే పర్లేదు, కానీ వివాదాస్పదమైన అంశాలలో కూడా పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీటివల్ల పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ కూడా ఇరకాటంలో పడేలా మారుతోంది.


అసలు విషయంలోకి వెళ్తే వైసిపి హయాంలో అప్పటి మంత్రిగా ఉన్న సినీనటి  రోజా పై విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ రోజా క్యారెక్టర్ ని కించపరిచేలా మాట్లాడిన ఆ టిడిపి నేత ను జగన్ ప్రభుత్వం అప్పుడు అరెస్టు చేసింది. కానీ వెంటనే ఆయన బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండారు సత్యనారాయణ ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు.


అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజా ఎపిసోడ్ లో తనకు మద్దతుగా నిలిచారని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేసింది. అంతేకాకుండా ఒక హోటల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ తననే వచ్చి కౌగిలించుకున్నారంటూ తెలియజేశారు టిడిపి నేత. మీరు ధైర్యంగా ఉండండి అన్ని విధాల అండగా ఉంటాం అంటూ చెప్పారట. ఈ విషయాల పైన అటు మహిళల నుంచి ,వైసీపీ శ్రేణుల నుంచి కొంతమేరకు పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత కనిపిస్తోంది. రాజకీయాల పరంగా ఎలా ఉన్నప్పటికీ మహిళల విషయంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన వారికి పవన్ ఓదార్చడం ఏంటి అంటూ అటు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గతంలో తన తల్లిని దూషించారంటూ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎంత బాధ పడ్డారో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు వైసీపీ నేత రోజా విషయంలో ఆ నిబద్ధత ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదాస్పదమైన అంశం లోకి పవన్ కళ్యాణ్ ని  లాగడంతో జనసేన కార్యకర్తలు అసహనంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: