
ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాలను 32 కి పెంచేలా చూస్తున్నారు. అలాగే కొత్తగా 6 జిల్లాలు రాబోతున్నాయట. అందులో (అమరావతి, మదనపల్లి, పలాస, మార్కాపురం, రాజంపేట, గూడూరు )వంటివి కొత్తగా రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఒకటి రెండు స్థానాలలో కూడా మార్పులు చేర్పులు ఉండవచ్చనే విధంగా తెలుస్తోంది. రాజధాని అమరావతిని మాత్రం ప్రత్యేకం జిల్లాగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుతో పాటుగా అలాగే కందుకూరు, అద్దంకి నియోజకవర్గంలను ప్రకాశంలో కలిపేందుకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలి అంటూ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. గత వైసిపి పాలనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాను 3 జిల్లాలలోకి విభజించారు. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి,నెల్లూరు జిల్లాలో కలిసినటువంటి కందుకూరు నియోజవర్గాలను ప్రకాశంలోనే ఉంచాలని అక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేశారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడ వారు డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు కూడా కందుకూరు, అద్దంకిని ఒంగోలులో కలిపేస్తామంటూ హామీ ఇచ్చారు.మరి ఏంటన్నది జనవరిలో తేలబోతోంది.