ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా చాలా చోట్ల నేతల మధ్య ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. అయినా కూడా కూటమిని ఎక్కడ విచ్ఛిన్నం కాకుండా బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కూటమి అధికార నేతలు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పి పై చేసిన వ్యాఖ్యలకు, ఉండి ఎమ్మెల్యే (RRR ) ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఆ డిఎస్పి మంచి ఆఫీసర్ అంటూ కితాబు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు పేకాట క్లబ్బుల వివరాలను తెలియజేస్తూ జయసూర్య మీద దర్యాప్తు చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆ విషయాలను పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు.


నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ ఉన్నత అధికారులతో సమావేశం అయ్యి పలు నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా పంచాయతీల పాలన సంస్కరణల  వల్ల ఫలితాలు ప్రజలకు అందించాలి అంటూ ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు బలోపేతం చేయడానికి పలు సంస్కరణలు తీసుకువచ్చామని వాటి ద్వారా ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యతలను అధికారుల పైన ఉంచారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవంబరు ఒకటవ తేదీ నుంచి DDO కార్యాలయాలను ప్రారంభించాలంటూ ఆదేశాలను జారీ చేశారు.


అలాగే క్లస్టర్ విధానం రద్దుచేసి 13,351 గ్రామపంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలియజేశారు. గ్రామాలలో కనీస మౌలిక వసతుల కల్పనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతోనే పంచాయతీలు గ్రామీణ అభివృద్ధికి నిధులు అందిస్తామంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. 15 వ ఆర్థిక సంఘ నిధులతో పాటుగా పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలను రూపొందించాలంటు తెలిపారు పవన్ కళ్యాణ్. దీని ద్వారా తాను చేయాలనుకున్న పనులను సైలెంట్ గానే చేసుకుంటూ వెళ్తున్నారు.. ఏదైనా సరే ప్రజలకు కావాల్సిన పనులలో తాను ఉన్నానని తెలియజేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: