నెల్లూరు ప్రాంతానికి చెందిన గొల్ల రమేష్ తో పాటుగా ఆయన భార్య, అనూష ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో మరణించారు. కానీ మంటలలో చిక్కుకున్న సమయంలో రమేష్ భార్య అనూష తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని గుండెలకు హత్తుకుని గట్టిగా పట్టుకున్నారు. ముఖ్యంగా అప్పర్ బెర్త్ నుంచి కిందికి దిగేసరికి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో అనూష తన చేతిలోని కుమార్తెతో సహా కాలిపోయి మాంసం ముద్దుల మారిపోయారు. ఈ విషయం చూసిన చాలామందికి కంటతడి పెట్టించాలా చేసింది.
అలాగే ఒక మృతదేహం బస్సు అడుగు భాగంలో లగేజీ డెక్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే బెడ్తుల మధ్య ప్రయాణికులు రాకపోకలకు వీలుగా ఉండే ఇరుకైన మార్గంలో కూడా ఎన్నో మృతదేహాలు పడి ఉన్నాయి. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయాణించిన దట్టమైన పొగ రావడం వల్ల సృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయినట్లు కనిపిస్తోంది. ఇదే కాకుండా బస్సులో జరిగిన సంఘటనపై కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు.
రమేష్ బెంగళూరు ప్రత్యక్ష సాక్షి:
గురువారం రాత్రి హైదరాబాద్లో 10:30 నిమిషాలకు బస్సు ఎక్కామని కర్నూలు శివారు ప్రాంతంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. టైరు పంక్చరైందేమో అనుకున్నాం కానీ బయట నుంచి ఒక్కసారిగా మంటలు కనిపించాయి, ఎదురుగా తన అన్నయ్యను లేపి తలుపులు తెలుసుకోకపోవడంతో కిటికీ అద్దాలని పగలగొట్టి మరి నా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురు అందులో నుంచి బయటపడిపోయాం అంటూ తెలిపారు. అయితే ఈ ఘటనలో మా అన్నయ్య ఆయన భార్యతో పాటు ఇద్దరు పిల్లలు బయటికి రాలేక మరణించారని తెలిపారు.
జయసూర్య హైదరాబాద్ :
వీరిది హైదరాబాద్ అయినా బెంగళూరులో ఇంటర్వ్యూ ఉండడంతో గురువారం రాత్రి బస్సులో బయలుదేరామని కానీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సు గందరగోళంగా ఉండడంతో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. బస్ అగ్గిలో చిక్కుకుందని చెప్పడంతో వెంటనే అప్రమత్తమయి తనతో పాటు మరో ఇద్దరు బస్సు అద్దాలను పగలగొట్టి బయటికి దూకేశాం. అయినా కూడా గాయాలయ్యాయని నిద్రలో ఉన్నందువలన చాలా మంది బయటికి రాలేని పరిస్థితి ఉందని. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తమయ్యి ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారు తెలిపారు జయసూర్య.
హారిక ఐటి ఉద్యోగి:
బెంగళూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కానని.. కర్నూలు దాటాక కొంతమంది కిందికి దిగడంతో మొదట వాష్ రూమ్ కి ఏమో అనుకున్నాము కానీ మంటలు కనిపించడంతో ఒకాయన అద్దాలు పగలగొట్టుకొని మరి బయటికి దూకేశారు. దీంతో తాను ఏం ఆలోచించకుండా కిటికీలోనుంచి దూకేశ తలకు దెబ్బలు తగిలాయి, అయినా కూడా ప్రాణాలతో బయటపడతామనుకోలేదని తెలిపింది.
సత్యనారాయణ ఐటీ ఉద్యోగి
బస్సులో పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో మెలకువ వచ్చిందని అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. బస్సులో ఉండే వారంతా కూడా కిటికీ అద్దాలు పగలగొట్టుకుని మరి వెళ్తున్నారు. దీంతో తాను దూకేయడంతో తన కాలు విరిగిందని ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కళ్ళముందే బస్సు పూర్తిగా కాలిపోయిందని తెలిపారు.
వేణుగోపాల్ రెడ్డి కర్ణాటక:
రాత్రి హైదరాబాద్ నుంచి 10:30 నిమిషాలకు బయలుదేరాను అర్ధరాత్రి ఒక పెద్ద శబ్దం రావడం వల్ల మెలకువ వచ్చింది కానీ అప్పటికే దట్టమైన పొగ కమ్మేసింది ఏం జరిగిందని తెలిసేలోపు బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి.. దీంతో ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దూకేశాను, బస్సులో చివరి సీట్లో ఉండడం వల్లే తాను బ్రతికి బయటపడ్డాను అంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి