బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి యొక్క శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో ఈ బస్సు ప్రమాద ఘటన పైన 16 బృందాలతో ప్రత్యేకించి మరి విచారణ చేస్తున్నారని హోంమినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడించారు. మృతులలో ఏపీకి చెందినవారు ఆరు మంది ఉన్నారని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఆరు మంది ఉన్నారని, మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారు కూడా కొంతమంది ఉన్నారు.. అధికారులు బైకును ఢీ కొట్టడం వల్లే బస్సుకి ఈ మంటలు వ్యాపించాయని చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా డ్రైవర్ వాదన మరొక లాగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నడిపినటువంటి డ్రైవర్ లక్ష్మయ్య పరారైనప్పటికీ అక్కడ మరొక డ్రైవర్ శివ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే శివ ప్రమాదం గురించి పోలీసులకు ఇలా తెలియజేస్తూ.. ద్విచక్ర వాహనాన్ని అంతకుముందే ఎవరో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని, అతడి మృతి దేహం కూడా రోడ్డు పక్కన పడి ఉందని, కేవలం అతడు తోలిన బైకు మాత్రం రోడ్డు మధ్యలో పడి ఉందని. మా బస్సు వేగంగా వెళుతున్న క్రమంలో ఆ బైక్ దగ్గర వచ్చేవరకు కనిపించకపోవడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కాకపోవడంతో ఈ ప్రమాదం నుంచి బయట పడాలని బస్సును బైకుపై నుంచి పోనిఇచ్చే ప్రయత్నం చేశామని, చివరికి బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ముందుకు వెళ్లలేకపోయాం.. ఒకవేళ మా బస్సు ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నట్లుయితే శివశంకర్ మృతదేహం కూడా బస్సు కింద నుజు నుజ్జు అయ్యేదంటూ పోలీసులకు తెలియజేశారు శివ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి