తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు, శాసనబద్ధమైన వ్యవస్థకు మరో పేరు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ లోపలే అలజడి రేగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలను కూడా పక్కనపెట్టి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేసిన ధైర్యసాహస అడుగులు పార్టీ అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. ఆయన టార్గెట్ ఎవరో తెలుసా ? విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని! ఇద్దరూ తమ తాడోపేడో తేల్చుకునే దిశలో పయనిస్తున్నారని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రూ.150 కోట్ల స్కాం ఆరోపణ! .. కొద్ది రోజుల క్రితం ఎన్నికల సమయంలో కేశినేని చిన్నికి తాను రూ.5 కోట్లు ఇచ్చానని ఆధారాలతో బయటపెట్టిన కొలికపూడి, ఇప్పుడు మరింత ఘాటుగా ఆరోప‌ణ‌లు చేస్తున్న‌రు.


 హైద్రాబాద్ ప్రగతినగర్‌లో కేశినేని చిన్ని వెంచర్ పేరుతో రూ.150 కోట్లకు పైగా వసూలు చేశారని, ఆ స్థలం ప్రభుత్వ భూమిగా తేలడంతో అమాయకులు మోసపోయారని కొలికపూడి బాంబు పేల్చారు. దీంతో టీడీపీలో షాక్ వేవ్స్ పుట్టాయి. చంద్రబాబు ఆదేశాలకే ధిక్కారం! .. వివాదం పెరగకూడదని, విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇద్దరూ మౌనం పాటించాలంటూ పల్లా శ్రీనివాస్ ద్వారా సూచనలు పంపినట్టు సమాచారం. కానీ కొలికపూడి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నవంబర్ 2న హైదరాబాదులో బాధితులు సమావేశం అవుతుంటే, తానూ వారిలో ఒకరినని ప్రకటించడం పార్టీ లోపల మంటలు రేపింది. అట్లాంటా కంపెనీపై కొత్త ఆరోపణ .. ఇంతటితో ఆగని కొలికపూడి, కేశినేని చిన్ని సొంత అట్లాంటా కన్సల్టెన్సీ కంపెనీపై మరో బాంబు పేల్చారు.



ఇక‌ అదే సామాజిక వర్గానికి చెందిన 400 మందిని ఉద్యోగంలోకి తీసుకుని, వారిని ఏడాది రోజులుగా జీతాలు ఇవ్వకుండా బానిసలా పనిచేయిస్తున్నారని, ఆ ఉద్యోగులు త్వరలో మీడియా ముందుకు వస్తారని హెచ్చరించారు. టీడీపీ లోపల తుఫాన్! .. ఇలా పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించి, తన సొంత ఎజెండాతో కేశినేని చిన్నిపై దాడి ప్రారంభించిన కొలికపూడి చర్యలు తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధానికి నాంది పలికినట్లయ్యాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు వైపే. ఈ దూకుడు ఎక్కడ ఆగుతుంది? కొలికపూడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్నలు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: